ప్రస్తుతానికి పర్లేదు...భవిష్యత్తులో ప్రమాదం
- December 11, 2016
ప్రపంచ పైకప్పుగా పేరొందిన టిబెట్‌లో సగటు ఉష్ణోగ్రత, వర్షపాతం స్థిరంగా పెరిగినట్లు ఓ పరిశోధనా కేంద్రం విడుదల చేసిన నివేదికలో తేలింది. చైనాకు చెందిన టిబెట్ స్వయంప్రతిపత్త వాతావరణ కేంద్రం, ప్రాంతీయ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ల పరిశోధక కేంద్రంలు సంయుక్తంగా ఈ నివేదికను విడుదల చేశాయి. గ్లోబల్‌వార్మింగ్ కారణంగా టిబెట్ వాతావరణంలో ఓ వైపు వేడి, మరోవైపు వర్షపాతమూ పెరిగినట్లుగా ఆ నివేదిక పేర్కొంది. ఈ మార్పులను రెండు వైపులా పదునున్న కత్తిగా నిపుణులు పోల్చారు. ఈ పరిస్థితి టిబెట్‌లో వ్యవసాయానుకూల వాతావరణానికి నాంది పలుకుతుంది.అయితే సమయం గడుస్తున్న కొద్దీ ఇది మరింత ప్రమాదానికి దారి తీయనుందని వారు అభిప్రాయపడ్డారు. గడిచిన మూడున్నర దశాబ్దాలుగా మే నుంచి సెప్టెంబరు మధ్య(వరద సీజన్)లో స్థిరంగా ఉష్నోగ్రతలు పెరుగుతున్నాయి. 1981 నుంచి 2016 మధ్య సగటు ఉష్ణోగ్రతలో దశాబ్దానికి 0.3 డిగ్రీల సెంటిగ్రేడ్ చొప్పున పెరుగుదల నమోదైనట్లు ఆ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది వరద సీజన్‌లో సగటు ఉష్ణోగ్రత 11.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
సాధారణ ఉష్ణోగ్రతతో పోలిస్తే ఇది 0.44 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ. మరోవైపు ఈ ఏడాది సగటు వర్షపాతం 445.1ఎంఎంగా నమోదైంది. మిగిలిన ఏళ్లతో పోల్చుకుంటే ఇది 62. 4 ఎంఎం ఎక్కువ అని నివేదిక వెల్లడించింది.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







