'ప్రవాసి ఎక్సలెన్స్' కు అమెరికా నుండి ఐదుగురి ఎంపిక

- December 11, 2016 , by Maagulf

డిసెంబర్ 18న హైదరాబాద్ లో అవార్డుల ప్రధానం 

వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనపర్చిన అమెరికా కు చెందిన ఐదుగురు ప్రవాస భారతీయ (ఎన్నారై), భారత సంతతి (పిఐఓ) వ్యక్తులను వారి  నైపుణ్యం, సామర్ద్యం పాటు మానవతా దృక్పథంతో వారు అందించిన సేవలకు గుర్తింపుగా ప్రవాసి ఎక్సలెన్స్ అవార్డ్స్-2016 కు ఎంపికయ్యారు. 

కొయలిషన్ ఆఫ్ ఓవర్సీస్ తెలంగాణ అసోసియేషన్స్ (కోట) మరియు ప్రవాసి మిత్ర మాసపత్రిక సంయుక్త ఆధ్వర్యంలో 18 డిసెంబర్ 2016  ఆదివారం హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో జరిగే ఇంటర్నేషనల్ మైగ్రంట్స్ డే (అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం) కార్యక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా 26 మందికి ఈ అవార్డుల ప్రధానం జరుగుతుందని  'కోట' వ్యవస్థాపక అధ్యక్షులు మంద భీంరెడ్డి తెలిపారు. 

గ్లోబల్ క్యాన్సర్ అవేర్నెస్ కాంపేన్ కు గాను న్యూయార్క్ నివాసి జయశ్రీ తేలుకుంట్ల; 

సైంటిస్ట్గా, లంగాణ ఉద్యమంలోఎన్నారైల పాత్రలో వ్యూహకర్తగా సేవలందించిన డాలస్ నివాసి డా. మోహన్ గోలి;  
యంగ్ సాఫ్ట్వేర్ ఎంటర్ ప్రేనర్, ఫిలాంత్రపిస్ట్ గా సేవలందిస్తున్న అట్లాంటా నివాసి కిరణ్ రెడ్డి పాశం; 
సైన్స్, ఇంజనీరింగ్, ఎంటర్ ప్రేనర్ గా సేవలందిస్తున్న వర్జీనియా నివాసి డా. పిబి రాంరెడ్డి; 
సంగీతంలో సేవలందిస్తున్న కాలిఫోర్నియా నివాసి సాయి మనాప్రగడ ప్రవాసి ఎక్సలెన్స్ అవార్డ్స్-2016 లకు ఎంపికయ్యారు. 
నామినేషన్లను ఈ అవార్డుల కమిటీ పరిశీలించింది: ప్రొ.ఆడప సత్యనారాయణ (చైర్), కట్ట కవిత (కో- చైర్), అరుణా నాయుడు నిమ్మగడ్డ (మెంబర్), డా.కె.స్వరూపా రెడ్డి (మెంబర్), నిజాం వెంకటేశం (మెంబర్), పి. సునీల్ కుమార్ రెడ్డి (మెంబర్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com