స్థూలకాయం తగ్గేందుకు లేత మునగాకు..
- December 11, 2016
మునక్కాడలు అందరికీ తెలుసు. పొడవైన కాడలను కూరల్లోనూ పులుసుల్లోనూ వండుకుంటాం. కాడలు అడిగితే ఇవ్వడానికి బాధపడతారు. లేత చిగుళ్లు ఇచ్చేందుకు ఎవరు బాధపడరు. ఈ చిగుళ్లు పసుపు పచ్చగా మెరుస్తుంటాయి. వీటితో అనేక వంటకాలు చేసుకోవచ్చు. తోటకూరలాగా, పప్పు పులుసు, పచ్చడి అన్నీ చేసుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటాయి. వీటిని తరచూ తింటుంటే వాత వ్యాధులన్నిటిలోనూ ఔషధంలా పనిచేసి నొప్పులు, పోట్లు తగ్గిస్తాయి.
కడుపులో పైత్యం, మంట, గ్యాస్, వేడిని తగ్గిస్తుంది. కడుపులోని పాములను వెళ్లగొట్టేందుకు సహకరిస్తుంది. కఫ దోషాన్ని తగ్గిస్తుంది. కళ్లకు మేలు చేస్తాయి. అన్నిటికన్నా ముఖ్యం కొవ్వును కరిగించి, పొట్ట తగ్గించేందుకు స్థూలకాయం తగ్గేందుకు తోడ్పడతాయి. గుప్పెడు లేత మునగ చిగుళ్లను నీటిలో వేసి రసం పొడి కలిపి కమ్మని చారును కాసుకుని ప్రతి ఉదయం రాత్రి ఒక్కో గ్లాసు చొప్పున తాగండి లేదా అన్నంలో తినండి. చాలా కమ్మటి ఆహార పదార్థం మాత్రమే కాకుండా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. కీళ్లనొప్పులు, పక్షవాతం, స్థూలకాయం ఉన్నవారికి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది
తాజా వార్తలు
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!







