సజ్జల కిచిడి
- December 11, 2016
కావలసిన పదార్థాలు: సజ్జలు- అరకప్పు, పెసరపప్పు- పావుకప్పు, క్యారెట్, బీన్స్(తరిగి), బఠానీ, మొక్కజొన్న గింజలు అన్నీ కలిపి- ఒక కప్పు, కారం- ఒక టీస్పూను, ఉల్లిపాయ(తరిగి), ఎండుమిర్చి- ఒక్కోటి చొప్పున, పసుపు- పావుటీస్పూను, జీలకర్ర- ఒక టీస్పూను, ఉప్పు- తగినంత.
తయారీ విధానం: సజ్జలు, పెసరపప్పును వేరు వేరుగా అరగంటపాటు నానబెట్టాలి. ప్రెషర్ కుక్కర్లో రెండు టీస్పూన్ల నూనె వేడి చేసి జీలకర్ర, ఉల్లిపాయలు వేసి అవి గోధుమరంగులోకి మారే వరకు వేగించాలి. ఆ తరువాత కూరగాయ ముక్కలు వేసి మూడు నిమిషాలపాటు వేగించాలి. నానబెట్టిన సజ్జలు, పెసరపప్పును కడిగి, నీళ్లు వడకట్టి కుక్కర్లో రెండు నిమిషాలు వేగించాలి. ఆ తరువాత పసుపు, ఉప్పు, కారం, వేసి మూడు కప్పుల నీళ్లు పోసి మూత పెట్టేయాలి. ఐదారు విజిల్స్ వచ్చేవరకు సన్నటి మంటపై ఉడికించాలి. ప్రెషర్ పోయి విజిల్ తీసాక కుక్కర్లో ఇంకా నీళ్లు ఉంటే అవి ఆవిరయ్యే వరకు వేడి చేస్తే సరి. నోరూరించే సజ్జల కిచిడీ తయారవుతుంది.. దీన్ని పెరుగుతో లేదా ఏదైనా చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







