ప్రవాసి ఎక్సలెన్స్ అవార్డులకు గల్ఫ్ నుండి 15 మంది ఎంపిక
- December 11, 2016
అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం (ఇంటర్నేషనల్ మైగ్రంట్స్ డే) సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా 26 మంది ఎన్నారైలు ప్రవాసి ఎక్సలెన్స్ అవార్డ్స్-2016 కు ఎంపికయ్యారు. ఇందులో గల్ఫ్ దేశాలలో నివసించే 15 మంది ప్రవాస భారతీయులకు చోటు దక్కింది. కొయలిషన్ ఆఫ్ ఓవర్సీస్ తెలంగాణ అసోసియేషన్స్ (కోట) మరియు ప్రవాసి మిత్ర మాసపత్రిక సంయుక్త ఆధ్వర్యంలో 18 డిసెంబర్ 2016 ఆదివారం హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డుల ప్రధానం జరుగుతుంది. వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనపర్చిన ప్రవాస భారతీయ (ఎన్నారై), భారత సంతతి (పిఐఓ) లను నైపుణ్యం, సామర్ద్యం పాటు మానవతా దృక్పథంతో వారు అందించిన సేవలను గుర్తించి ప్రవాసి ఎక్సలెన్స్ అవార్డులతో సత్కరించి అవార్డులను ప్రధానం చేయనున్నామని అవార్డుల కమిటీ అధ్యక్షులు ప్రొ. అడపా సత్యనారాయణ తెలిపారు.
అవార్డు గ్రహీతల వివరాలు: ఖతార్ నుండి ఒకరు గుగ్గిళ్ల రవిగౌడ్, సౌదీ అరేబియా నుండి ఇద్దరు శేషుకుమార్ పితాని, మహ్మద్ అబ్దుల్ రహ్మాన్ సలీం, కువైట్ నుండి ముగ్గురు అభిలాష గొడిశాల, రామ్మోహన్ రావ్ కొత్తపల్లి, రాజశేఖర్ చప్పిడి, ఒమాన్ నుండి నలుగురు గిరీష్ కుమార్, రెజిమోన్ కుట్టప్పన్, లింగయ్య పోల్సాని, రాందాస్ చందక, యుఏఇ నుండి ఐదుగురు కె. కుమార్, షరీఫ్ నూరుల్లా, ఇ. తులసి ప్రసాద్, శ్రీకాంత్ చిత్తర్వు, జైతా నారాయణ.
ప్రొ.ఆడప సత్యనారాయణ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల అవార్డుల కమిటీ నామినేషన్లను పరిశీలించింది. ఇందులో కట్ట కవిత, అరుణా నాయుడు నిమ్మగడ్డ, డా.కె.స్వరూపా రెడ్డి, నిజాం వెంకటేశం, పి. సునీల్ కుమార్ రెడ్డి లు సభ్యులు.



తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







