డిసెంబర్ 21 తరువాత వాహనాల డెకరేషన్ నిషేధం
- December 13, 2016
దోహా కోర్నిచ్‌లోని కొంత ప్రాంతం డిసెంబర్ 18న ఉదయం 6.30 నిమిషాల నుంచి 10 గంటల వరకు మూసివేయబడ్తుందని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ వెల్లడించింది. డైరెక్టర్ ఆఫ్ మీడియా అండ్ అవేర్‌నెస్ లెఫ్టినెంట్ కల్నల్ మొహమ్మద్ రది అల్ హజ్రి మాట్లాడుతూ, నేషనల్ డే సెలబ్రేషన్స్‌లో భాగంగా తమ వాహనాల్ని డెకరేట్ చేసుకోవాలనుకునేవారికి డిసెంబర్ 15 నుంచి 21 వరకు మాత్రమే అవకాశం ఉందనీ, ఆ తర్వాత వాహనాలకు డెకరేషన్ చేయడం పూర్తిగా నిషిద్ధమని చెప్పారు. కోర్నిచ్‌లోని ఖతార్ పోస్ట్ ఆఫీస్ నుంచి రస్ బుయాబూద్ ప్రాంతం వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ఆయన వివరించారు. పెరేడ్‌ని తిలకించాలనుకునేవారు ముందుగా ఆ ప్రాంతానికి చేరుకోవాలని, పార్కింగ్ ప్రాంతాల్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తప్పిపోయినవారి సమాచారం కోసం పోలీసుల్ని ఆశ్రయించాలని కోరారు లెఫ్టినెంట్ హిజ్రి. నేషనల్ డే సెలబ్రేషన్స్ విజయవంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, అందరూ ట్రాఫిక్ నిబంధనల్ని పాటించాలని ఆయన సూచించారు. ప్రైవేటు వాహనాలకన్నా ఏర్పాటు చేసిన పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్‌ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారాయన.
తాజా వార్తలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ







