వార్దా తుఫాన్‌పై ఏపీ అప్రమత్తం
- December 13, 2016
వార్ధా తుఫాన్‌పై ఏపీ అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించింది. ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొందుకు ఏర్పాట్లు చేసింది. తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు... అనుక్షణం రక్షణ చర్యలపై పర్యవేక్షిస్తూనే ఉన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపు, పునరావాసంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వార్ధా తుఫాన్ ఏపీ తీరాన్ని వణికించింది. ఏ క్షణం ఎలాంటి ఉపధ్రవం ముంచుకొస్తుందోనన్న భయం అనుక్షణం వెంటాడింది. అయితే నిన్న మధ్యాహ్నం తీరం దాటే సమయంలో తుఫాన్ కాస్తా దిశ మార్చుకోవడంతో ఏపీ ఊపిరి పీల్చుకుంది. అయితే నెల్లూరు జిల్లాపై తుపాను ప్రభావం చూపింది. ఇదిలా ఉంటే ముందస్తుగానే తీర ప్రాంత అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది ప్రభుత్వం. పునరావాస కేంద్రాల ఏర్పాటుతోపాటు ఎన్డీఆర్‌ఎఫ్ దళాలను సిద్ధం చేసింది. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. అన్ని జిల్లాల్లోనూ తుఫాన్ సమాచార కేంద్రాలను ఏర్పాటు చేశారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంతో వీటిని అనుసంధానం చేశారు. సీఎం చంద్రబాబు అనుక్షణం పరిస్థితిపై సమీక్షించారు. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వార్ధా ఎఫెక్ట్‌తో ఏయే జిల్లాల్లో ఎన్ని గ్రామాలు ప్రభావితం అయ్యాయి, ఎంత మేర నష్టం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. బాధితులకు పునరావాసం, భోజన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారుల్ని ఆదేశించారు. తుఫాన్ ప్రభావంతో నెల్లూరులో 75 కరెంటు స్తంభాలు, చిత్తూరులో 40 కరెంటు స్తంభాలు దెబ్బతిన్నాయి. వాటిని వెంటనే పునరుద్దరించాలన్నారు. ఏపీలో వరదాయపాలెంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. నెల్లూరు, చిత్తూరు జిల్లాలో భారీవర్షాలు, కడపలో ఒకమోస్తరు వర్షం కురుస్తోంది. చిత్తూరు జిల్లాలో ఈదురుగాలులకు చెట్లు బాగా పడిపోయాయి. తిరుమలను భారీ వర్షం ముంచెత్తింది. నెల్లూరు జిల్లాలోని 11మండలాల్లో పునరావాస శిబిరాల్లో ఉన్న 11వేల మందికి భోజన ఏర్పాట్లు చేశారు. అటు, తుఫాన్ ఎఫెక్ట్‌తో ఇబ్బందులు పడుతున్న తమిళనాడువాసులకు సాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం ప్రకటించారు. మరోవైపు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ద్యం మెరుగుపరచాలని, వైద్యబృందాలను 24గంటలు అందుబాటులో ఉంచాలని, మందులు పంపిణీచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్‌లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







