అల్ వహ్‌దా మాల్ మరో గిన్నీస్ యత్నం
- December 13, 2016
అబుదాబీలోని అల్ వహ్‌దా మాల్ మరో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కోసం యత్నించింది. 9 మీటర్ల పొడవు, 5 మీటర్ల ఎత్తున్న జెయింట్ బైసికిల్‌ని ప్రదర్శనకు ఉంచారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద నడపగలిగేందుకు వీలున్న బైక్ ఇది. కార్బన్ ఫుట్ ప్రింట్స్‌ని తగ్గించేందుకుగాను ఈ ప్రదర్శనను అవగాహనా కార్యక్రమంగా ఏర్పాటు చేశారు. ప్రముఖ కార్టూనిస్ట్, అలాగే పలు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌ని పొందిన గిన్నీస్ దిలీఫ్ దీన్ని రూపొందించారు. యూఏఈ 45వ నేషనల్ డే సందర్బంగా ఈ అటెంప్ట్ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేస్తున్నామనీ, ఆరోగ్యకరమైన సమాజం కోసం చేస్తున్న ఈ అవగాహనా కార్యక్రమం అభినందనీయమని అల్ వహ్‌దా మాల్ జనరల్ మేనేజర్ మిస్టర్ నౌమాన్ ఠాకూర్ చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు సైకిలింగ్ ఎంతో ఉపకరిస్తుందని నిర్వాహకులు చెప్పారు. ఈ తమ ప్రయత్నంతో ఖచ్చితంగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధిస్తామని వారు తెలిపారు.
తాజా వార్తలు
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!







