బిఐసి వద్ద ఆకాశంలో వెలుగులు విరజిమ్మనున్న ఫైర్ వర్క్స్
- December 13, 2016
బహ్రెయిన్ నేషనల్ డే సందర్భంగా శుక్రవారం బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (బిఐసి) వద్ద ఆకాశంలో అత్యద్భుతమైన ఫైర్ వర్క్స్ ప్రదర్శన జరుగుతుంది. ఈ ఏడాది బిఐసి నేషనల్ డే ఫెస్టివల్‌లో ఇదే ప్రధాన ఆకర్షణ కానుంది. శనివారం నేషనల్ డే ఫెస్టివల్ జరగనుంది. కాగా, శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి ఫైర్ వర్క్స్ షో ప్రారంభమవుతుంది. పెద్ద సంఖ్యలో ప్రతి యేడాదీ ఈ ఫైర్ వర్క్స్‌ని తిలకించేందుకు వస్తారు. ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా కాంతులీనేలా ఆకాశాన్ని ఫైర్ వర్క్స్‌తో నింపేయనున్నారు నిర్వాహకులు. ఇంకో వైపున సంప్రదాయ షాపింగ్ ఎక్స్‌పీరియన్‌నసని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే కార్పొరేట్‌ఎగ్జిబిషన్ స్పేస్, చిల్డ్రన్ యాక్టివిటీస్, ప్లే ఏరియా, కల్చరల్ షోస్, ఫుడ్ బెవరేజెస్ ఔట్‌లెట్స్‌ని కూడా ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నారు. ఈ ఫెస్టివల్‌ని తిలకించేందుకుగాను ఎంట్రన్స్ ఫీజుని 500 ఫిల్స్‌గా నిర్ణయించారు. సాయంత్రం 4 గంటల నుంచి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







