'కఫాలా' సిస్టమ్‌కి ఖతార్ గుడ్ బై
- December 13, 2016
ఖతార్, నిన్నటినుంచి అధికారికంగా కఫాలా సిస్టమ్‌ని రద్దు చేసింది. ఇది ఖతార్ చరిత్రలోనే అతి పెద్ద లేబర్ రిఫామ్‌గా అభివర్ణించబడ్తోంది. చాలాకాలంగా ఈ విధానానికి స్వస్తి చెప్పాలనే డిమాండ్లు వినవస్తున్నాయి. దానికి తగ్గట్టుగా ప్రయత్నాలు కూడా జరిగాయి. డిసెంబర్ 13 నుంచి ఈ విధానానికి స్వస్తి చెబుతున్నట్లు లేబర్ మినిస్టర్ ఇస్సా బిన్ సాద్ అల్ జఫాలి అల్ నౌమి చెప్పారు. కఫాలా విధానం ప్రకారం ఖతార్‌లో ఉద్యోగం చేయడానికి వచ్చే వ్యక్తికి ఖతార్‌కి చెందిన వ్యక్తి స్పాన్సరర్‌గా వ్యవహరించాలి. ఉద్యోగం కోసం వచ్చిన వ్యక్తి, ఉద్యోగం వదిలి వెళ్ళాలన్నా, దేశం విడిచి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆ స్పాన్సరర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కఫాలా విధానాన్ని రద్దు చేసి, కాంట్రాక్ట్ బేస్డ్ సిస్టమ్‌ని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ విధానం ద్వారా వలసదారుడైన కార్మికుడికి ఖతార్‌లో పలు హక్కుల్ని సంక్రమింపజేస్తారు. ఏ కార్మికుడైనాసరే వర్క్ ప్లేస్‌లో మిస్‌ట్రీట్ చేయబడితే, అతను ఆ ఉద్యోగం నుంచి బయటకొచ్చేందుకు వీలుంది కొత్త విధానం ద్వారా. కొత్త విధానంలో కూడా స్పాన్సరర్ అనుమతి అవసరం ఉంటుంది. అయితే స్పాన్సరర్ అనుమతి ఇవ్వని పక్షంలో అప్పీల్స్ కమిటీక్‌కి వెళ్ళి, తద్వారా ఉపశమనం పొందే వీలు కార్మికుడికి లేదా ఉద్యోగికి లభిస్తుంది. కార్మికుల హక్కులకు భంగం కలిగించే స్పాన్సరర్లు లేదా యజమానులకు జరిమానా విధించేలా కొత్త చట్టం తీసుకువచ్చారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







