టాలీవుడ్ లో కొత్త ప్రాజెక్ట్ లతో బిజీ గా ఉన్న అరవింద్ స్వామి
- December 13, 2016
దళపతి సినిమాలో చిన్న పాత్రలో వెండి తెరపై మెరుపులా మెరిశాడు.. ఇక రోజా సినిమాతో మంచి పాపులర్ అయ్యాడు... ముంబై సినిమాతో స్టార్ హీరో సమానంగా స్టార్ డమ్ తెచ్చుకున్న అరవింద్ అమ్మాయిల కలల హీరోగా మారాడు... కానీ అవకాశాలు లేక వెనుకబడిపోయాడు.. దీంతో అరవింద్ తన పంథా మార్చుకొని తనిఒరువన్ లో విలన్ గా నటించాడు.. ఆ సినిమా సూపర్ హిట్ కావడమే కాదు... హీరో కంటే కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు.. కాగా తనిఒరువన్ సినిమాను తెలుగులో ధృవ గా రీమేక్ చేశారు... ఇటీవల రిలీజ్ అయిన ధృవ కు భారీ రెస్పాన్స్ వస్తుంది. సిద్ధార్ద్ అభిమన్యుగా అరవింద్ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా అందుతున్నాయి. కాగా ఈ సినిమా రిలీజైన తర్వాత అరవింద్ స్వామికి తెలుగులో క్రేజీ ఆఫర్స్ అందుతున్నాయి. కేవలం 7 రోజుల్లోనే 15 క్రేజీ ప్రాజెక్ట్స్ అరవింద్ స్వామి తలుపుతట్టాయి. కాగా వీటిలో ఇప్పటికీ 3 సినిమాలకు అరవింద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది... కాగా హీరో నుంచి విలన్ గా మారి క్రేజీ ఆఫర్స్ అందుకొంటున్న జగపతి బాబుకి ఇప్పుడు అరవింద్ స్వామి పోటీగా మారాడు అని ఫిల్మ్ నగర్ లో టాక్ గా వినిపిస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం







