బురఖా లేని ఫొటో పోస్ట్ చేసిందని మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు
- December 13, 2016
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకీ ఆమె నేరం ఏమిటంటే, బహిరంగ ప్రదేశంలో బురఖా లేకుండా తిరగడంతో పాటు.. ఆ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం. పోలీసు ప్రతినిధి ఫవాజ్ అల్ మైమన్ ఆమె పేరు చెప్పలేదు గానీ, పలు వెబ్‌సైట్లు మాత్రం ఆమె పేరు మలక్ అల్ హెహరీ అని చెప్పాయి. గత నెలలో రియాద్‌లోని ఓ మెయిన్‌రోడ్డులో బురఖా లేకుండా ఫొటో తీయించుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఆమెపై కామెంట్లతో పలువురు విరుచుకుపడ్డారు.
ఆమె సాధారణ నైతిక నియమాలను ఉల్లంఘించినందుకు తమ విధులు నిర్వర్తించినట్లు పోలీసు ప్రతినిధి మైమన్ తెలిపారు. సౌదీ సమాజంలో మహిళలు బహిరంగ ప్రదేశాల్లో బురఖా ధరించడం తప్పనిసరని, కానీ ఆమె మాత్రం రియాద్‌లోని ఓ ప్రముఖ కేఫ్ పక్కన ముసుగు లేకుండా నిలబడి ఫొటో తీయించుకుని దాన్ని ట్వీట్ చేసిందని చెప్పారు.
ఆమెను అరెస్టుచేసి జైల్లో పెట్టామన్నారు. ''నిషేధించిన సంబంధాల'' గురించి తనకు సంబంధం లేని పురుషులతో మాట్లాడినట్లు కూడా ఆమెపై ఆరోపణలొచ్చాయి. దేశంలో అమలవుతున్న చట్టాలను ఆమె స్పష్టంగా ఉల్లంఘించినట్లు రియాద్ పోలీసులు చెప్పారు. ఇస్లాం బోధనలకు ప్రజలు కట్టుబడి ఉండాలని కోరారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







