కేరళ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆరుగురుని అరెస్టు చేసిన పోలీసులు
- December 13, 2016
అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో జాతీయగీతం ప్రదర్శించే సమయంలో ఆరుగురు వ్యక్తులు లేచి నిలబడకపోవడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. తిరువనంతపురంలోని నిషాగాంధీ ఆడిటోరియంలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ప్రారంభమైంది. కార్యక్రమంలో భాగంగా ఈజిప్టు చిత్రాన్ని ప్రదర్శించే ముందు జాతీయగీతాన్ని ప్రదర్శించారు. ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైన ఆరుగురు వ్యక్తులు జాతీయగీతం వచ్చే సమయంలో లేచి నిలబడలేదు. పోలీసులు, ఐఎఫ్ఎఫ్కే నిర్వాహకులు, ఛైర్మన్ కమల్‌తో పాటు పలువురు.. వారిని నిలబడమని కోరినా తిరస్కరించారు. దీంతో పోలీసులు ఆ ఆరుగురిని అరెస్టు చేశారు.
అరెస్టు అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా జాతీయగీతం ప్రదర్శించే ముందు యువత లేచి నిలబడకపోవడంపై భాజపా యూత్ వింగ్ వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆదివారం చెన్నైలోను ఇలాంటి ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







