మెగా అభిమానులకు శుభవార్త.!
- December 13, 2016
మెగా అభిమానులకి గుడ్ న్యూస్. ఒకే టికెట్ పై మెగాస్టార్ చిరంజీవి నటించిన 150 సినిమాలు చూడొచ్చు. అదెలా ? అంటే.. మెగా స్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెం.150'. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
మెగా అభిమానుల కోసం 'మెగా ఖైదీ'లో సప్రైజ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. చిరంజీవి నటించిన 149 చిత్రాలతో కూడిన టీజర్ ని 'ఖైదీ నెం.150'లో ప్రదర్శించబోతున్నారంట. దీంతో.. మెగా అభిమానులు ఖైదీ నెం.150తో పాటుగా చిరు 149 సినిమాలని చూసిన అనుభూతిని పొందడం గ్యారెంటీ అంటున్నారు. అంటే.. ఒకే టీజర్ పై మెగాస్టార్ 150 సినిమాలు చూడొచ్చన్న మాట.
ఇక, ఇప్పటికే మెగా ఖైదీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'ధృవ' థియేటర్స్ లో మెగా ఖైదీ ట్రైలర్ సందడి చేస్తోంది. ట్రైలర్ ప్రదర్శింపబడుతోన్న టైంలో థియేటర్స్ దద్దరిల్లిపోతున్నాయి. వి.వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో చిరు సరసన కాజల్ జతకట్టనుంది. ఈ చిత్రానికి సంగీతం దేవీ శ్రీ ప్రసాద్. రాంచరణ్ నిర్మాత.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







