ఒకేసారి సిల్వర్ స్క్రీన్ పై మెరవనున్న సూపర్‌స్టార్ మరియు మెగాస్టార్
- December 13, 2016
సూపర్‌స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి.. ఈ ఇద్దరూ సిల్వర్ స్క్రీన్‌పై ఒకేసారి మెరిస్తే వారి వారి అభిమానులకే కాదు ప్రేక్షకులకు కూడా ఓ సూపర్ సర్‌ప్రైజ్‌గా ఉంటుందని చెప్పటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. త్వరలోనే ఈ సూపర్ ప్రైజ్ నిజం కాబోతోందని సమాచారం. రజనీకాంత్, శంకర్ కాంబినేషన్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో 'రోబో 2.0' చిత్రం రూపొందుతున్న విషయం విదితమే. 2010లో విడుదలై సంచలన విజయం సాధించిన 'రోబో' చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈచిత్రంలో ప్రతినాయకుడుగా బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షరుకుమార్ నటిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈచిత్రంలోని ఓ కీలక పాత్రలో చిరంజీవి లేదా మహేష్ నటిస్తాడనే వార్తలు ఇటీవల వినిపించాయి. అయితే ఫైనల్‌గా మెగాస్టార్ నటించేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. చిరంజీవి ప్రస్తుతం తన 150వ చిత్రం 'ఖైదీ నెం.150' చిత్రంలో నటిస్తున్నారు. ఈచిత్రాన్ని వచ్చే ఏడాది జవనరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







