నాలుగు నూతన చేపల రేవుల అభివృద్ధి ...మరో తొమ్మిది రేవుల సామర్ధ్యం పెంపు
- December 13, 2016
మస్కట్ : నాలుగు నూతన చేపల వేటాడే రేవులను అభివృద్ధి చేసి మరో తొమ్మిది రేవుల సామర్ధ్యం పెంపునకు వ్యవసాయం మరియు మత్య్సశాఖ యోచిస్తోంది. వ్యవసాయం మరియు మత్య్సశాఖ ఫిషింగ్ పోర్ట్స్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఖలీద్ బిన్ మన్సూర్ బిన్ సబీల్ అల్ జడ్జలి ఈ సందర్భంగా మాట్లాడుతూ, తమ మంత్రిత్వశాఖ ప్రస్తుతం13 ప్రాజెక్టులకు సంబంధించి కన్సల్టెన్సీ అధ్యయనాలు ముగింపు ప్రక్రియలో ఉందని తెలిపారు. మహోత్ , సదాహ్ , అల్ శువైమియా మరియు రాఖ్యుట్ ఆ నాలుగు నూతన చేపల వేటాడే రేవులని పేర్కొన్నారు. అదేవిధంగా, తొమ్మిది రేవుల సామర్ధ్యం విస్తరించేందుకు చర్యలు చేపట్టనున్నారు. వాటిలో కంజర్ , లిమా, డిబ్బా, ఖబౌరః , క్కురియట్ , అల్ అశేఖర , మాసిరః, మిర్బట్ మరియు ధాల్క్హౌట్ ఉన్నాయని అన్నారు. ఒమన్ అంతటా 3,165 కిలోమీటర్ల తీర ప్రాంత పరిధిలో 23 ఫిషింగ్ పోర్ట్సు, ముసణ్డం రాజ్యము నుండి ధోఫర్ రాజ్యము దిగువ వరకు విస్తరించి ఉందని డాక్టర్ జడ్జలి అన్నారు.45 వేల మంది కంటే ఎక్కువ మంది జాలర్లు 20 వేల పడవలతో 275,000 టన్నులకు పైగా చేపలను ఉత్పత్తి చేస్తూ 30 మిలియన్ల ఒమాన్ రియాళ్ళ కంటే ఎక్కువ ద్రవ్యాన్ని ఆర్జిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఇందుకు సంబంధించిన అధ్యయనం పూర్తి కావోస్తుందని మరియు మంత్రిత్వశాఖ టెండర్ల ప్రక్రియ కోసం సిద్ధమవుతున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







