దుబాయ్ లో మహిళపై భారతీయ యువకుడి వెకిలి చేష్టలు..
- December 15, 2016
బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లిన ఓ భారతీయ యువకుడు అక్కడ ఓ బ్రిటిష్ మహిళను లైంగికంగా వేధించాడు. ఈ కేసులో అతడిని దోషిగా నిర్ధారించిన కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. పోలీసుల కథనం ప్రకారం.. ఈ ఏడాది మే 31న 35 ఏళ్ల బ్రిటిష్ మహిళ పచారీ సరుకుల కోసం ఆర్డర్ చేసింది. 23 ఏళ్ల భారతీయ యువకుడు సరుకులు తీసుకుని ఆమె ఇంటికి వచ్చాడు. గార్డెన్‌లో కూర్చున్న ఆమె అక్కడికి రమ్మని అతడిని ఆహ్వానించింది. సరుకులు డెలివరీ చేసిన తర్వాత యువకుడు అక్కడి నుంచి వెళ్లేందుకు తాత్సారం చేశాడు. ఆ తర్వాత ఒక్కసారిగా ఆమెను పట్టుకుని ముద్దుపెట్టుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
మహిళ ఆరోపణలను నిందితుడు ఖండించాడు. సరుకులు డెలివరీ చేసేందుకు వెళ్లిన తనకు మద్యం ఆఫర్ చేసిందని, తీసుకునేందుకు తాను నిరాకరించడంతో కట్టుకథ అల్లిందని వివరించాడు. దీంతో నిజనిర్ధారణ కోసం ఫోరెన్సిక్ నిపుణులు మహిళ మెడమీది డీఎన్ఏను సేకరించి చేసిన పరీక్షలో అతడు ఆమె శరీరాన్ని ముట్టుకున్నట్టు తేలింది. దీంతో బుధవారం కోర్టు అతడికి మూడు నెలల జైలు శిక్ష విధించింది.
శిక్షాకాలం పూర్తయిన తర్వాత అతడిని దేశం నుంచి పంపించి వేయనున్నారు. కాగా కోర్టు తీర్పుపై పదిహేను రోజుల్లోపు పైకోర్టును ఆశ్రయించవచ్చని న్యాయమూర్తి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







