పాన్ నిబంధనల మార్పు
- December 15, 2016
పెద్దనోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం పలు చట్టాల్లో మార్పు చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆదాయపన్ను చట్టంలోని శాశ్వత ఖాతా సంఖ్య (పాన్)కు సంబంధించిన 14(బి) నిబంధనను సవరించారు. ఈ మేరకు రూ.50,000 నుంచి రూ.2.5 లక్షల వరకు డిపాజిట్ చేసిన ఖాతాల పైనా ఐటీ అధికారులు నిఘా పెడతారు.
గతంలో పాన్ సంఖ్య ఇవ్వడం ఇష్టం లేనివారు రూ.50,000 కన్నా కొంచెం తక్కువ సొమ్మును పలుమార్లు జమ చేసేవారు. కొత్త నిబంధన ప్రకారం పాన్ సంఖ్య ఇవ్వకుండా ఒకే బ్యాంకు ఖాతాలో రూ.50,000 కన్నా తక్కువ మొత్తం పలు దఫాలుగా జమ చేసిన ఖాతాలపై ఇక నుంచి ఐటీ అధికారులు నిఘా ఉంచుతారు.
నవంబర్ 9 నుంచి డిసెంబర్ 30 మధ్య కాలంలో దఫదఫాలుగా రూ.2.5 లక్షలు అంతకన్నా ఎక్కువ జమ చేసిన బ్యాంకు ఖాతా వివరాలను బ్యాంకు అధికారులు ఐటీ విభాగానికి అందించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







