భారీగా పెరగనున్న ఇంధనం ధరలు
- December 15, 2016
గ్లోబల్ ముడి చమురు ధరలు దేశీయ పెట్రో ధరలు షాకివ్వనున్నాయి. దేశీయ ఆయిల్ కంపెనీల గురువారం నాటి సమావేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.సుమారు లీటరుకు రూ.7 పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు బారెల్ 55 డాలర్లు చేరువకావడంతో పెట్రోల్, డీజిల్ ధరలు ఈ మేరకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
15 రోజులకు ఒకసారి జరిగే ఆయిల్ కంపెనీల సమావేశంలో పెట్రో ధరల సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నాయి.అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు, డాలర్ల మార్పిడి రేటు ఆధారంగా భారతదేశంలోనిఇంధన ధరలు తగ్గించేందుకు, పెంచేందుకుగానీ ఈ సమావేశాలు కీలకం.ఈ నేపథ్యంలో పెట్రో ధరల పెంపుపై నిర్ణయం ఈరోజు తీసుకోనున్నాయి. అలాగే డాలర్ మారకపు రేటులో దేశీయ కరెన్సీ రూపాయి రూ. 67 స్థాయికి పడిపోవడం కూడా పెట్రో ధరలపై ప్రభావం చూపనున్నాయి.మరోవైపు ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిలో కోత పెట్టేందుకు అంగీకరించడంతో గ్లోబల్ చమురు పుంజుకుంటున్నాయి. రో్జుకు దాదాపు1.2 మిలియన్ల బ్యారెళ్ల ఉత్పత్తికి బ్రేక్ వేసేందుకు అంగీకరించాయి. దీంతో రాబోయే రెండు మూడు నెలల్లో పెట్రో ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని ఇటీవలి నివేదికలు వెల్లడించాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరల పెరుగుదలతో పెట్రోల్ ధర మరో 3-4 నెలల్లో 6-8 శాతం, డీజిల్ 5-8 శాతం పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ రీసెర్చ్ సంస్థ నివేదించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







