స్పాన్సర్ ఇంట్లో ఉరేసుకున్న మెయిడ్
- December 15, 2016
రస్ అల్ ఖైమా: ఇథియోపియన్ మెయిడ్, స్పాన్సర్ ఇంట్లోనే ఉరివేసుకుని చనిపోయిన ఘటన రస్ అల్ ఖైమాలో చోటు చేసుకుంది. అల్ మౌమురా ప్రాంతంలో డిసెంబర్ 10న మెయిడ్, తన స్పాన్సర్ ఇంట్లోని ఫ్యాన్‌కి ఉరేసుకుని చనిపోయినట్లు అధికారులు ధృవీకరించారు. ఓ ఎమిరేటీ ఫ్యామిలీకి మెయిడ్‌గా పనిచేస్తోంది ఆమె. యూఏఈకి ఈ ఆగస్ట్‌లోనే ఆమె వచ్చి, కేవలం మూడు నెలలు మాత్రమే మెయిడ్‌గా పనిచేసినట్లు పోలీసులు ధృవీకరించారు. పనిచేస్తున్న సమయంలో మెయిడ్ ప్రవర్తన వింతగా ఉండేదని స్పాన్సర్ చెప్పారు. ఇంట్లో సమస్యల కారణంగానే తాను మెయిడ్‌గా పనిచేసేందుకు రావాల్సి వచ్చినట్లు ఆమె తమకు చెప్పిందని స్పాన్సర్ పోలీసులకు వివరించారు. అనారోగ్యంతో బాధపడ్తున్న భర్త, ఇద్దరు పిల్లలు ఆమెకు ఉన్నట్లుగా తెలిపారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్







