దయనీయ స్థితిలో అజ్మన్ ఫొటోగ్రాఫర్
- December 15, 2016
23 ఏళ్ళుగా అజ్మన్ అందాల్ని తన కెమెరాలో బంధిస్తూ వచ్చిన ఫ్రీలాన్స్ ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ ఆసుపత్రిలో దయనీయ స్థితిలో ఉన్నారు. అల్ ఖాసిమి హాస్పిటల్‌లో ఆయన వైద్య చికిత్స పొందుతున్నారు. షార్జాలోని ఈ ఆసుపత్రిలో ఆయనకు యాంజియో ప్లాస్టీ శస్త్ర చికిత్స జరిగింది. సలీమ్ అబ్దుల్ రెహమాన్, సలీమ్ త్రిపప్రాయర్‌గా సుపరిచితుడు. అజ్మన్, త్రిప్రాయర్‌లను ఒకేలా అభిమానించి, ఆరాధించేవాడంటూ సలీమ్ గురించి ఆయన సన్నిహితుడు సదారుద్దీన్ చెప్పారు. ప్రభుత్వ శాఖలకు చెందిన అనేక ఈవెంట్స్‌ని ఫొటోగ్రాఫర్‌గా అత్యద్భుతంగా కవర్ చేసిన ఘనత సలీమ్ సొంతం. బ్యూటీ ఆఫ్ అజ్మన్ పేరుతో ఫేస్‌బుక్ పేజీని నిర్వహిస్తూ, అత్యద్భుతమైన ఫొటోల్ని అందులో ఉంచుతున్నారు సలీమ్. ఇంత మంచి పేరు తెచ్చుకున్నా, కుటుంబం కోసం ఏమీ ఆయన సేవ్ చేసుకోలేకపోయారు. 61 ఏళ్ళ సలీమ్‌కి 16 ఏళ్ళ కుమారుడు, 13 ఏళ్ళ కుమార్తె ఉన్నారు. అతనికి మెడికల్ ఇన్స్యూరెన్స్ కూడా లేదు. దాంతో అతని పరిస్థితి దయనీయంగా తయారైంది. ఆయన కుటుంబ సభ్యులు కూడా అతన్ని స్వదేశానికి తీసుకెళ్ళేందుకు దారి లేక అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం







