నగదు రహిత పథకాలను క్రిస్మస్ కానుకలుగా అభివర్ణించిన మోదీ
- December 15, 2016
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రకటించిన అదృష్ట వినియోగదారుడు, డిజీ ధన్ వ్యాపారి పథకాలను క్రిస్మస్ కానుకలుగా ప్రధాని మోదీ అభివర్ణించారు. ''నగదు రహిత, అవినీతి రహిత భారతానికి ఇవి ఊపు తెస్తాయి'' అని ట్వీట్ చేశారు.
షరతులు వర్తిస్తాయి..
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ), యూఎ్సఎ్సడీ, ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ (ఏఈపీఎస్), రూపే కార్డుల ద్వారా డిజిటల్ చెల్లింపులు చేసే వారు మాత్రమే అర్హులు. ప్రైవేటుకార్డులైన వీసా, మాస్టర్ కార్డులు, డిజిటల్ వాలెట్ల ద్వారా చెల్లింపులు చేసేవారికి ఈ పథకం వర్తించదు.
కనీసం 50 రూపాయలు, గరిష్ఠంగా రూ.3 వేలు చెల్లింపులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.
వినియోగదారుడు-వ్యాపారి, వినియోగదారుడు-ప్రభుత్వ సంస్థల మధ్య జరిగే చెల్లింపులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఏఈపీఎస్ చెల్లింపులు అన్నింటినీ పరిగణిస్తారు. ఆయా చెల్లింపులు చేసినప్పుడు వెలువడే లావాదేవీ ఐడీ (ట్రాన్సాక్షన ఐడీ) ఆధారంగా ఆటోమేటిక్ పద్ధతిలో లక్కీ వినియోగదారులు, వ్యాపారులను నజరానాలకు ఎంపిక చేస్తారు. ఈ లావాదేవీలన్నింటినీ భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన (ఎనపీసీఐ) మదింపు చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని తర్వాత టెక్నికల్, సెక్యూరిటీ ఆడిట్ చేయనున్నారు.
ఎప్పటి నుంచి ఎప్పటి వరకు?
పెద్దనోట్లు రద్దయిన మరుసటి రోజు (నవంబరు 9) నుంచి డిజిటల్ లావాదేవీలు జరిపిన వినియోగదారులు, వ్యాపారులంతా లక్కీ డ్రాకు అర్హులే. మొదటి డ్రా ఈనెల 25వ తేదీన క్రిస్మస్ పండుగ సందర్భంగా తీస్తారు. మెగా డ్రా 2017 ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి సందర్భంగా తీస్తారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







