పుణ్య క్షేత్రాల సందర్శనకు సప్తగిరి ఎక్స్ ప్రెస్
- December 16, 2016
శ్రీ సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకం పై మాస్టర్ హోమిమోపతి అధినేత డాక్టర్ రవికిరణ్ నిర్మించిన సినిమా సప్తగిరి ఎక్స్ ప్రెస్. టాలీవుడ్ స్టార్ కమెడియన్ సప్తగిరి హీరోగా ఎంట్రీ ఇస్తోన్న ఈ సినిమా డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సప్తగిరి ఎక్స్ ప్రెస్ టీమ్ దేశంలో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహస్తోంది. ఈ బృందం ముందుగా
డిసెంబర్ 17న శ్రీశైలం
డిసెంబర్ 20న తిరుపతి
డిసెంబర్ 21న షిరిడి
వెళ్లేలా సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాత రవికిరణ్ తెలిపారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఆడియోకు, టీజర్ కు, ట్రైలర్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అదే రీతిన వచ్చే శుక్రవారం విడుదల కాబోతున్న సినిమాకు కూడా భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోందని సప్తగిరి ఎక్స్ ప్రెస్ టీమ్ థీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో కన్నడ భామ రోషిణి ప్రకాష్, సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ తెలుగు చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు. హైదరాబాద్, పోలాండ్, జర్మనీల్లో సప్తగిరి ఎక్స్ ప్రెస్ షూటింగ్ జరిగింది. సినిమాటోగ్రాఫ్ రామ్ ప్రసాద్, ఎడిటర్ గౌతంరాజు ఈ సినిమాను తమ నైపుణ్యంతో ప్రేక్షకుల్ని ఆద్యంతం అలరించే విధంగా తీర్చి దిద్దారని చిత్ర బృందం తెలిపింది. త్రివిక్రమ్ శిష్యుడు అరుణ్ పావర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్ : డాక్టర్ వాణి రవికరిణ్, సినిమాటోగ్రాఫర్ : సి.రామ్ ప్రసాద్, ఎడిటిర్ : గౌతంరాజు, క్రియేటివ్ హెడ్ : గోపాల్ అమిరశెట్టి, మాటలు : రాజశేఖర్ రెడ్డి పులిచర్ల.



తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







