రాత్రి 10 గంటలకే బుర్జ్ ఖలీఫా,దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ మూసివేత
- December 16, 2016
దుబాయ్: బుర్జ్ ఖలీఫా / దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ నూతన ఏడాది వేడుకకు రాత్రి 10 గంటల నుంచి మూసివేయనున్నట్లు దుబాయ్ పోలీస్ రవాణా భద్రత విభాగం గురువారం ప్రకటించింది. దుబాయ్ పోలీస్ రవాణా భద్రత విభాగానికి డైరెక్టర్ కల్నల్ మహ్మద్ అహ్మద్ అల్ బస్తాకి ఈ సందర్భంగా మాట్లాడుతూ, నూతన సంవత్సర వేడుకులలో సమగ్ర భద్రత మరియు ట్రాఫిక్ ప్రణాళిక దుబాయ్ లో నిర్వహించేందుకు ఈ చర్యలు తీసుకొంటున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా కొత్త ఏడాది ఎటువంటి అపశృతులు జరగకుండా ఉండేందుకుఆ పరిసర ప్రాంతాల్లో వాహనాలు, ప్రజా రవాణా,పాదచారులకు ఇబ్బందులు కలగకుండా నిర్వహణ సక్రమంగా కొనసాగించేందుకు దోహదపడుతుందని అన్నారు.రహదారులను మరియు రవాణా సంస్థ మరియు పలు సంస్థల సమన్వయ ఫలితంగా ప్రణాళికలు అమలుపర్చనున్నట్లు అల్ బస్తాకి తెలిపారు. ఈ ప్రక్రియలో పోలీసు గస్తీ ముమ్మరంగా ఉండటమే కాక అదనపు పార్కింగ్ స్థలాలను సృష్టించడం, రోజంతా అటూ ఇటూ తిరిగే బస్సులను ఏర్పాటుచేయడం కలిగి, మరియు కొన్ని మెట్రో స్టేషన్ల మరికొన్నిరోడ్లు మూసివేయబడతాయి.డానుబే, వరల్డ్ ట్రేడ్ సెంటర్ మరియు ఫైనాన్షియల్ సెంటర్ మెట్రో స్టేషన్లు నూతన ఏడాది వేడుకలో నిర్వహించబడతాయి.ఈ నూతన సంవత్సర వేడుకలు హాజరు అయ్యే ప్రజలు బుర్జ్ ఖలీఫా / దుబాయ్ మాల్ స్టేషన్ బదులుగా వేరే ఇతర మార్గాలు ఉపయోగించాల్సి ఉంటుందని అన్నారు. ప్రజలు ట్రాఫిక్ లో ఇరుక్కోకుండా నివారించేందుకు ఉత్సవాల్లో ప్రజా రవాణా సక్రమంగా ఉపయోగించడానికి ఈ చర్యలు ఎంత గానో ఉపయోగపడుతాయని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







