నలుగురు మహిళల హత్య కేసులో సెక్స్ అఫెండర్కి మరణశిక్ష
- December 16, 2016
నలుగురు మహిళల్ని హత్య చేసిన కేసులో కాలిఫోర్నియాకి చెందిన సెక్స్ అఫెండర్ని దోషిగా నిర్ధారించి మరణ శిక్ష విధించింది న్యాయస్థానం. విచారణ సందర్భంగా బాధిత మహిళల కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదించారు. న్యాయం జరిగిందని చెప్పలేంగానీ, చనిపోయినవారి ఆత్మ కొంతవరకు శాంతిస్తుందని చెప్పగలమని వారు తెలిపారు. స్టీవెన్ డీన్ గోర్డాన్ అనే వ్యక్తి ఈ నలుగురు మహిళల మృతికి కారకుడు. అతి క్రూరంగా మహిళల్ని చంపినట్లు విచాణలో గోర్డాన్‌పై అభియోగాల్ని నిరూపించారు. 47 ఏళ్ళ గోర్డాన్తోపాటు, 30 ఏళ్ళ ఫ్రాంకో కానో కూడా మహిళల్ని అపహరించి, హత్య చేసిన కేసులో దోషిగా తేల్చారు. ఇద్దరూ విడివిడిగా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. 21 ఏళ్ళ జర్రాయ్ ఎస్టీప్ అదృశ్యం కేసులో విచారణ జరుపుతుండగా ఈ నేరస్తుల నేరాలు వెలుగు చూశాయి. కియానా జాక్సన్, జోసెఫిన్ మోనిక్ వర్గాస్, మార్తా అనయా తదితరులు హత్యకు గురయినవారిలో ఉన్నారు. ఈ నలుగురికీ ప్రాస్టిట్యూషన్తో సంబంధాలున్నాయి. 2010 నుంచి గోర్డాన్, కానో మధ్య సంబంధాలున్నట్లు పోలీసులు నిర్ధారించారు. వీరిద్దరిపైనా గతంలోనూ అనేక కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించడం జరిగింది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







