పెట్టుబడిదారుల కోసం సింగిల్ విండో ప్రాజెక్ట్
- December 16, 2016
ప్రైమ్ మినిస్టర్, ఇంటీరియర్ మినిస్టర్ షేక్ అబ్దుల్లా బిన్ నాజర్ బిన్ ఖలీఫా అల్ థని, సింగిల్ విండో ప్రాజెక్టుని ఇన్వెస్టర్స్ సర్వీసెస్ కోసం మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ కామర్స్ - లుసైల్ సిటీ హెడ్ క్వార్టర్స్‌లో ప్రారంభించారు. ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థనీ సూచనల మేరకు దీన్ని ఏర్పాట్లు చేసినట్లు షేక్ అబ్దుల్లా చెప్పారు. ఇది ప్రభుత్వం తీసుకున్న అతి ముఖ్యమైన కార్యక్రమంగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఖతార్ నేషనల్ విజన్ 2030లో భాగంగా పెట్టుబడిదారుల్ని ఆకర్షించేందుకు ఈ సింగిల్ విండో ప్రాజెక్ట్‌కి రూపకల్పన చేయడం జరిగింది. సింగిల్ విండో సిస్టమ్ మేనేజ్‌మెంట్ కో-ఆర్డినేటింగ్ కమిటీ కోసం డెసిషన్ నెంబర్ 23, 2016ని నిన్ననే విడుదల చేశారు. కమిటీకి ప్రైమ్ మినిస్టర్ కార్యాలయం నుంచి రిప్రెజెంటేటివ్ నాయకత్వం వహిస్తారు. మినిస్ట్రీస్ ఆఫ్ ఇంటీరియర్, ఎనర్జీ అండ్ ఇండస్ట్రీ, ఫైనాన్స్, ఎకానమీ అండ్ కామర్స్, జస్టీస్, అడ్మినిస్ట్రేటివ్ డెవలప్‌మెంట్ అండ్ లేబర్ అండ్ సోషల్ ఎఫైర్స్, ట్రాన్స్‌పోర్ట్ అండ్ మ్యూనికేషన్స్, మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ ఖతార్ టూరిజం అథారిటీ అండ్ ఖతార్ ఛాంబర్ ప్రతినిథులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. కమిటీ పీరియాడికల్‌గా రిపోర్ట్స్‌ని ప్రైమ్ మినిస్టర్‌కి అందజేస్తుంది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







