ఖాతిఫ్‌లో అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైన జడ్జి
- December 16, 2016
జెడ్డా: ఈస్టర్న్ ప్రావిన్స్ సెక్యూరిటీ అథారిటీస్, అనుమానాస్పదంగా అదృశ్యమైన ఖాతిఫ్ - ఎండోవ్మెంట్స్ అండ్ ఇన్హెరిటెన్స్ డిపార్ట్మెంట్ జడ్జ్ షేక్ మొహమ్మద్ అల్ జిరానీ వ్యవహారంపై విచారణ జరుపుతున్నాయి. టారుట్ ఐలాండ్‌లోని తన ఇంటి నుంచి షేక్ మొహమ్మద్ అదృశ్యమైనట్లుగా భావిస్తున్నారు. ప్రాథమికంగా జడ్జిని ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతుండగా, ఇంతవరకు అధికారికంగా సెక్యూరిటీ ఫోర్సెస్ జడ్జి అదృశ్యంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ అధికార ప్రతినిథి మన్సూర్ అల్ ఖఫారి మాట్లాడుతూ మినిస్టర్ ఆఫ్ జస్టిస్, సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ అదిపతి వాలిద్ అల్ సమాని ఈ ఘటనను జాగ్రత్తగా ఫాలో అవుతున్నట్లు చెప్పారు. ఈ కేసుని డీల్ చేయగల శక్తి సెక్యూరిటీ ఫోర్సెస్‌కి ఉందని ఆయన చెప్పారు. షేక్ అల్ జిరానీ ఆస్తులపై గతంలో పలుమార్లు గుర్తు తెలియని వ్యక్తుల కారణంగా దాడులు జరిగాయి. ఆయన ఇంటిని తగలబెట్టే ప్రయత్నం కూడా చేశారు. 2012 అక్టోబర్‌లో అల్ రుబైయాలోని ఆయన ఇంట్లోకి చొరబడేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు కూడా. ఈ ఘటనలో షేక్ అల్ జిరానీ కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







