దుబాయ్ లో 50 వేల డి హెచ్ విలువ చేసే పరంజాలను చోరీ చేసిన భారతీయ గార్డు
- December 17, 2016
' కంచె చేను ..మేసిన రీతిలో ' రక్షణగా ఉండాల్సిన 22 ఏళ్ల భారతీయ కార్మికుడు తాను పనిచేసే నిర్మాణ సంస్థకు కుచ్చుటోపీ పెట్టబోయి ఎంచక్కా దొరికిపోయాడు. నిర్మాణ స్థలంలో 50 వేల డి హెచ్ విలువ చేసే పరంజాలను దొంగిలించాడని కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ ఈ మేరకు ఆరోపించబడింది. ఈ దొంగతనం సంఘటన పై జెబెల్ ఆలీ పోలీసు స్టేషన్ కు ఆగస్టు11వ తేదీన నివేదించబడింది.ఆగష్టు 11 వ తేదీన నిర్మాణ కార్మికులు కొన్ని పరంజాలు నిర్మాణ స్థలం నుండి పోయినట్లు గుర్తించారు. వారు ఈ మేరకు ఒక సివిల్ ఇంజనీర్ కు ఈ సమాచారం చెప్పారు. ఈ అపహరణ విషయమై కర్తవ్య నిర్వహణలో ఉన్న సెక్యూరిటీ గార్డుని అడగ్గా,ఆ ఉదయం టీ తాగేందుకు వెలుపలికి వెళ్ళినపుడు బహుశా ఈ దొంగతనం జరిగి ఉండవచ్చని కాకమ్మ కబుర్లు చెప్పబోయాడు.దీనితో ఆ ఇంజినీర్ పోలీసులకు పిర్యాదు చేసిన నేపథ్యంలో అక్కడకు చేరుకున్న పోలీసులు తమదైన రీతిలో ఆ భారతీయ కార్మికుడిని ప్రశ్నించి వాస్తవం రాబట్టేరు . పబ్లిక్ ప్రాసిక్యూషన్ రికార్డుల ప్రకారం రెండోవ నిర్మాణ స్థలం నుండి పరంజాలను దొంగిలించి వాటిని ఒక పాకిస్తానీ వ్యక్తికి అమ్మినట్లు నేరం ఒప్పుకున్నాడు. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను డిసెంబర్ 26 వ తేదీన జరగాల్సి ఉంది.
తాజా వార్తలు
- విద్యార్థులే వికసిత్ భారత్ నిర్మాణ శిల్పులు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- రేపు సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
- రియాద్‌కు ఉత్తరంగా హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ కూల్చివేత..!!
- వికలాంగులు, వృద్ధులకు ఆర్థిక సేవలు.. ఖతార్ సెంట్రల్ బ్యాంక్ కీలక ఆదేశాలు..!!
- దుబాయ్‌లో షేర్డ్ హౌసింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో ‘పేమెంట్ లింక్’ సేవకు త్వరలో ముగింపు..!!
- బైక్ చోరీ కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలుశిక్ష..!!
- కింగ్ ఖలీద్ విమానాశ్రయం పై బాలిస్టిక్ క్షిపణితో హూతీల దాడి
- చీటింగ్ చేస్తే ఇక వెంటనే చర్యలు లేవు.. IIT బాంబే కొత్త రూల్స్
- ప్రధాని నరేంద్ర మోదీకి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా హృదయపూర్వక శుభాకాంక్షలు







