యెమెన్‌లో 30 మంది సైనికులు మృతి
- December 18, 2016
యెమెన్‌లోని అడెన్ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 30 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ఈశాన్య అడెన్ ప్రాంతంలో ఉన్న సైనిక శిబిరం వద్ద జీతాలు తీసుకునేందుకు నిలబడిన సైనికులు లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్లు ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటివరకూ ప్రకటించలేదు. వారం రోజుల వ్యవధిలో అడెన్ ప్రాంతంలో సైనికులపై రెండోసారి దాడి జరగడం గమనార్హం. ఈనెల 10వ తేదీన అడెన్‌లోని సైనిక స్థావరం వద్ద సైనికులు జీతాలు తీసుకునేందుకు వేచి ఉన్న సమయంలో ఆత్మాహుతి దాడి జరిగి 50 మంది సైనికులు మృతిచెందారు. ఆ దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రకటించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2026కు యూఏఈలో శ్రీకారం
- సౌదీ అరేబియాకు బహ్రెయిన్ మద్దతు..!!
- ఒమన్‌లో 10 ఏళ్ల బాలుడు గల్లంతు..కొనసాగుతున్న గాలింపు..!!
- ఖతార్‌లో వరల్డ్ స్పేస్ వీక్ 2026 ప్రారంభం..!!
- కువైట్‌లో 194 మంది ప్రవాసుల డిపోర్ట్..!!
- యూఏఈలో Etisalat కస్టమర్లకు ఉచిత డేటా ఆఫర్..!!
- సౌదీ అరేబియాలో మరింత వేగంగా భద్రతాపరమన ఫిర్యాదులు..!!
- నజ్రాన్, జిజాన్ విమానాశ్రయాల పై దాడులు.. ముగ్గురికి గాయాలు
- ఏపీలో నాలుగు కొత్త కమిషనరేట్లకు ఆమోదం
- స్కూల్ ప్రాంగణంలో పిల్లల ఫొటోలు తీస్తే భారీ జరిమానా.. తల్లిదండ్రులకు హెచ్చరిక







