'అమ్మ' జయలలిత జీవిత చరిత్ర మూవీలో నటించేందుకు రెడీ..
- December 18, 2016
అమ్మ జయలలిత జీవిత చరిత్రను ఎవరైనా మూవీగా తెరకెక్కిస్తే బాగుంటుందని ఆమె అభిమాన నెటిజన్లు భావిస్తున్నారు. ఆమె పాత్రలో ఎవరు నటించాలన్న దానిపై ఊహాగానాలు సాగుతున్న దశలో .. 'బాహుబలి'లో శివగామిగా నటించిన రమ్యకృష్ణను జయలలిత మాదిరిగా ఫొటో షేప్ చేసి రూపొందించిన పోస్టర్ చటుక్కున సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. ఫుల్లీ ఫిల్మీ అనే ఫేస్బుక్ పేజీ ఈ పోస్టర్‌ను రూపొందించగా.. దీనిపై రమ్యకృష్ణ స్వయంగా స్పందించింది.కల్పితంగా క్రియేట్ చేసిన ఈ పోస్టర్‌ను వాట్సాప్‌లో తనకు తన ఫ్రెండ్స్ పంపారని, ఇది కల్పిత పోస్టర్ అయినప్పటికీ.. జయ జీవితంపై ఎవరైనా చిత్రం తీసేందుకు సిద్ధపడితే ఆమె రోల్లో నటించేందుకు ఎంతో ఉబలాటపడుతున్నానని తెలిపింది.
'బహుశా ఇప్పుడిది నా డ్రీమ్ రోల్ ఇదే' అని రమ్యకృష్ణ స్పష్టం చేసింది. జయలలిత చాలామంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచారని, అలాంటి గొప్ప వ్యక్తి జీవితాన్ని సినిమా తీస్తే అంతకన్నా కావలసింది ఏముంటుందని ఆమె పేర్కొంది.
తాజా వార్తలు
- గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2026కు యూఏఈలో శ్రీకారం
- సౌదీ అరేబియాకు బహ్రెయిన్ మద్దతు..!!
- ఒమన్‌లో 10 ఏళ్ల బాలుడు గల్లంతు..కొనసాగుతున్న గాలింపు..!!
- ఖతార్‌లో వరల్డ్ స్పేస్ వీక్ 2026 ప్రారంభం..!!
- కువైట్‌లో 194 మంది ప్రవాసుల డిపోర్ట్..!!
- యూఏఈలో Etisalat కస్టమర్లకు ఉచిత డేటా ఆఫర్..!!
- సౌదీ అరేబియాలో మరింత వేగంగా భద్రతాపరమన ఫిర్యాదులు..!!
- నజ్రాన్, జిజాన్ విమానాశ్రయాల పై దాడులు.. ముగ్గురికి గాయాలు
- ఏపీలో నాలుగు కొత్త కమిషనరేట్లకు ఆమోదం
- స్కూల్ ప్రాంగణంలో పిల్లల ఫొటోలు తీస్తే భారీ జరిమానా.. తల్లిదండ్రులకు హెచ్చరిక







