స్వీట్ కార్న్ వెజిటబుల్ సూప్
- September 06, 2015
ఈ రోజు స్వీట్ కార్న్ వెజిటబుల్ సూప్ ఎలా చేయాలో చూద్దాం..
కావలసిన పదార్ధాలు:
- స్వీట్ కార్న్ (క్రీం స్టైల్) - 1 టిన్
- స్వీట్ కార్న్ గింజలు - 1/2 కప్పు (ఉడికించినవి)
- వెజిటబుల్ స్టాక్ - 1.25 లీటర్లు (5 కప్పులు)
- బీన్స్ - 8 (సన్నగా తురిమినవి)
- క్యాబేజీ - 1/2 కప్ (సన్నగా తురినిమది)
- క్యారట్ - 1 (సన్నగా తురినిమది)
- కార్న్ ఫ్లోర్ - 2 1/2 టేబుల్ స్పూన్లు
- పంచదార - 3/4 టేబుల్ స్పూను
- ఉప్పు - తగినంత
- మిరియాల పొడి - తగినంత
- ఉల్లి కాడలు (సన్నగా తరిగినవి) - 3- 4 టేబుల్ స్పూన్లు
తయారు చేయు విధానం:
- ముందుగా ఒక మందంగా ఉండే బాండీలో క్రీం స్టైల్ స్వీట్ కార్న్ మరియు వెజిటబుల్ స్టాక్ వేసి బాగా కలపాలి.
- ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న బీన్స్, క్యాబేజీ, క్యారట్, ఉడికించిన కార్న్ ముక్కలు వేసి సన్నటి సెగ మీద మరిగించాలి.
- ఇప్పుడు ఒక చిన్న బౌల్ లో కాస్త వెజిటబుల్ స్టాక్ లేదా నీళ్ళు తీసుకొని కార్న్ ఫ్లోర్ ని కైపి ఒక పేస్టు లాగా చేసి పక్కన పెట్టుకోండి.
- మరుగుతున్న సూప్ లో పంచదార, ఉప్పు, మిరియాల పొడి వేసి 3 - 4 నిమిషాలు మరగనివ్వండి.
- ఈ పేస్టు ను మరుగుతున్న సూప్ లో బాగా కలుపుతూ వేయండి. ఈ సూప్ కాస్త చిక్కబడే దాకా మరిగించి స్టవ్ మీద నుండి దించేయండి.
- ఇప్పుడు ఉల్లి కాడలతో గార్నిష్ చేసుకొని తినటమే.!!
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







