టర్కీ సైనికుల సజీవ దహనం...
- December 23, 2016
డయాస్కస్/అంకారా: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరోసారి దారుణానికి ఒడిగట్టారు. టర్కీ సైనికులను సజీవ దహనం చేసినట్లున్న ఓ వీడియోను ఉగ్రవాదులు విడుదలచేశారు. గత నెల రోజులుగా ఇద్దరు టర్కీ సైనికులను బంధించి బోనులో పెట్టి, ఆపై చిత్ర హింసలకు గురిచేసి సజీవదహనం చేసినట్లు ఆ వీడియోలో ఉంది. జిహాది గ్రూప్ వెబ్ సైట్లలో గురువారం పోస్ట్ చేసిన ఆ వీడియో కలకలం రేపింది. ఇటీవల 16 మంది సైనికులను ఇస్లామిక్ స్టేట్ హత్యచేసింది. ఇదే క్రమంలో టర్కీ సైనికులపై తమ దాడులను టర్కీ సైనికుల సజీవదహనం ఘటన 2014 డిసెంబర్ లో ఉగ్రవాదులు జోర్డాన్ ఫైటర్ జెట్ ఫ్లైట్ పైలట్ మాజ్ అల్ కసాస్బ్ ను బోనులో బంధించి, ఆపై చిత్రహింసలకు గురిచేసి బోనులోనే సజీవ దహనం చేసిన ఘటనను తలపిస్తోంది.
ఇద్దరు ఉగ్రవాదులు టర్కీ అధ్యక్షుడు తాయిప్ ఎర్డోగన్ ను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సజీవదహనానికి గురైన సైనికులను జిహాదిస్టులు బంధించినట్లు ఐఎస్ఐఎస్ అనుబంధ న్యూస్ ఏజెన్సీ అమఖ్ గత నెలలోనే కథనాలు అందించింది. ముఖ్యంగా గత మూడు రోజులుగా సిరియాలోని పలు ప్రాంతాలలో వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలోనే ఐఎస్ఐఎస్ ఈ దుశ్చర్యకు పాల్పడిందని అధికారులు ఆరోపిస్తున్నారు.
తాజా వార్తలు
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు
- ఏపీలో టాటా పవర్..చిత్తూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్
- దుబాయ్లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!







