భారత ప్రవాసీయులూ...పాత నోట్లను ఇలా మార్చుకోండి...30 వ తేదీ తుది గడువు
- December 23, 2016
కతర్ :యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ప్రవాస భారతీయులకు రూ.500, రూ.2 వేలు భారతీయ కరెన్సీ నోట్లు చేరాలంటే మరికొంత సమయం పడుతుందని నిపుణులు చెప్తున్నారు. డాలర్, యూరో వంటి అంతర్జాతీయ కరెన్సీని ఆయా దేశాలు ఎగుమతి చేస్తూ ఉంటాయి. కానీ, భారతదేశం తన కరెన్సీని ఎగుమతి చేయదు. యూఏఈలోని మనీ ఎక్స్ఛేంజ్లు తమకు భారతీయులు అమ్మే కరెన్సీనే ఇతరులకు అమ్ముతూ ఉంటాయి. ఇండియన్ కస్టమర్లు తమవద్దనున్న పాత రూ.500, రూ.1,000 భారతీయ కరెన్సీ నోట్లను మార్చాలని మనీ ఎక్స్ఛేంజ్లను కోరుతున్నారు. కానీ ఎక్స్చేంజ్ల వద్ద కూడా కొత్త నోట్లు లేకపోవడంతో మార్పిడి సాధ్యమవడం లేదు. మనీ ఎక్స్ఛేంజ్లకు అధికారిక వేదిక అయిన ఫారిన్ ఎక్స్ఛేంజ్ అండ్ రెమిటెన్స్ గ్రూప్ (ఎఫ్ఈఆర్జీ) ఈ పరిస్థితిని గమనించింది. ప్రస్తుతం దేశంలో ఉన్న పాత ఇండియన్ కరెన్సీని మార్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని యూఏఈ సెంట్రల్ బ్యాంక్‌ను కోరింది. యూఏఈలోని బ్యాంక్ ఆఫ్ బరోడా పాత ఇండియన్ కరెన్సీని అంగీకరించడం లేదు. పాత నోట్లను తీసుకొనేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు అనుమతి కోరింది.
ప్రవాస భారతీయులకు భారతీయ రిజర్వు బ్యాంక్ ఇచ్చిన మార్గదర్శకాలను ఇచ్చింది వాటిని ఇపుడు చూద్దాం !!
ప్రశ్న : (1 ). ప్రవాస భారతీయులు విమానాశ్రయంలో మార్చుకోదగిన సొమ్ము ఎంత?
జవాబు : భారతదేశానికి వెళ్ళేవారు రూ.5 వేల విలువైన రూ.500, రూ.1,000 పాత కరెన్సీ నోట్లను విమానాశ్రయాల్లోని బ్యాంకులు లేదా మనీ ఎక్స్ఛేంజ్ల వద్ద మార్చుకోవచ్చు.
ప్రశ్న : (2 ). ప్రస్తుతం భారతదేశంలో లేనివారు ఏం చేయాలి?
జవాబు : భారతదేశంలో లేనివారికి భారతదేశంలో బ్యాంక్ నోట్లు ఉంటే, వాటిని తమ బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు ఒక వ్యక్తికి లిఖితపూర్వకంగా అధికారం కల్పించాలి. ఆ నోట్లతో ఆ వ్యక్తి బ్యాంకుకు వెళ్ళాలి. ఆథరైజేషన్ లెటర్‌తో పాటు చెల్లుబాటయ్యే గుర్తింపు వివరాలను సమర్పించాలి. ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు మొదటైనవి ఐడీ ప్రూఫ్‌గా సమర్పించవచ్చు.
ప్రశ్న : (3). ఎన్ఆర్ఐకి ఎన్ఆర్ఓ అకౌంట్ ఉంటే ఎక్స్ఛేంజ్ విలువను అకౌంట్లో జమ చేయవచ్చునా?
జవాబు : ఎన్ఆర్ఓ అకౌంట్‌కు నోట్లను జమ చేసుకోవచ్చు. దీనికి పరిమితి లేదు. అయితే రూ.2.50 లక్షలు దాటిన డిపాజిట్ల వివరాలను ఆదాయపు పన్ను శాఖాధికారులకు తెలియజేస్తారు. ఎన్ఆర్ఐ హోదాలో ఆదాయానికి మూలాన్ని తెలియజేయగలిగితే ఆ సొమ్ముపై పన్ను విధించరు.
ప్రశ్న : (4 ). నోట్ల మార్పిడికోసం ఎక్కడికెళ్ళాలి?
జవాబు : ఆర్బీఐ ఇస్యూ కార్యాలయాలు, వాణిజ్య బ్యాంకుల శాఖలు, గ్రామీణ బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులు పోస్టాఫీసులు, సబ్ పోస్టాఫీసుల్లో నోట్లను మార్చుకోవచ్చు.
ప్రశ్న : (5 ). జాగ్రత్తలు తీసుకోవలసిన అంశాలు
జవాబు : పాత నోట్లను జమ చేసేటపుడు ఐడీ ప్రూఫ్‌ల కాపీలపై సంతకం చేయాలి. జమ చేస్తున్న సొమ్ము, తేది రాసుకోవాలి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







