డ్రగ్స్ గ్యాంగ్ లీడర్‌కి మరణ శిక్ష..
- December 30, 2016
దోహా క్రిమినల్ కోర్ట్ ఐదుగురు వలసదారులకు డ్రగ్స్ కేసులో శిక్షలు విధించింది. ఇందులో ముఠా నాయకుడికి మరణ శిక్ష విధించింది. నలుగురు నిందితులు 120 కిలోల హాషిస్ మరియు ఓపియమ్ డ్రగ్స్‌ని స్మగుల్ చేస్తూ పట్టుబడ్డారు. ఈ కేసులో మొదటి నిందితుడికి 500,000 ఖతారీ రియాల్స్ జరీమానా అలాగే మరణ శిక్ష విధించింది. రెండో నిందితుడికి జరీమానా 500,000 ఖతారీ రియాల్స్ అలాగే జీవిత ఖైదు విధించింది. ఇదే శిక్ష మూడో నిందితుడికి కూడా విధించారు. నాలుగో వ్యక్తికి ఏడేళ్ళ జైలు శిక్ష, 200,000 ఖతారీ రియాల్స్ జరీమానా విధించగా, ఐదో నిందితుడికి ఏడాది జైలు, 10,000 ఖతారీ రియాల్స్ జరీమానా విధించారు. డ్రగ్స్ సేవించిన కేసులో ఇతనికి ఈ శిక్ష పడింది. స్మగ్లింగ్ కేసు నుంచి ఇతనికి ఊరట లభించింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







