బాలీవుడ్ లో రానున్న బంపర్ కాంబో
- January 01, 2017
"అ" అంటే అమితాబ్‌బచ్చన్, "ఆ" ఆమీర్‌ఖాన్ ప్రధాన పాత్రల్లో "థగ్స్ ఆఫ్ హిందుస్థాన్" పేరుతో ఓ భారీ చిత్రం రూపొంద నున్న విషయం తెలిసిందే. తమ అసాధారణ నటనతో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తమకంటూ ప్రత్యేకస్థానం ఏర్పరుచుకున్నారు. అమితాబ్‌బచ్చన్, ఆమీర్‌ఖాన్ కలయికలో వస్తోన్న తొలిచిత్ర మిదే కావడం విశేషం.ఇందులో వీరిద్దరి పాత్రలు వినూత్నంగా ఉంటాయని తెలిసింది. యశ్‌రాజ్ ఫిలింస్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రంలో హీరోయిన్గా '1. నేనొక్కడినే', 'దోచేయ్' సినిమాల ఫేమ్ కృతీ సనన్ నటించనున్నారని బాలీవుడ్టాక్. ఆమిర్‌ఖాన్‌కు జోడీగా కృతిసనన్ కథానాయికగా నటించనున్నట్లు సమాచారం.
ఆమె పేరును ఆమీర్‌ఖాన్ చిత్రవర్గాలకు సూచించినట్లు తెలిసింది. జయాపజయాలకు అతీతంగా చక్కటి అవకాశాల్ని సొంతం చేసుకుంటోంది కృతిసనన్. మహేష్‌బాబు కథానాయకుడిగా నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్లో అరంగేట్రం చేసిన ఈ సొగసరి ఆపై బాలీవుడ్ బాట పట్టింది. హీరోపంటి, దిల్వాలే సినిమాలతో హిందీ చిత్రసీమలో ప్రతిభను చాటుకుంది.
చిత్ర పరిశ్రమలో స్నేహితుల దగ్గర కృతి నటన గురించి ఆమిర్ చెబుతున్నారట. ప్రామిసింగ్ యంగ్‌స్టర్స్‌లో కృతి ఒకరని అన్నారట. ఓ వైపు అమితాబ్ బచ్చన్... మరోవైపు ఆమిర్‌ఖాన్... ఇద్దరు సూపర్స్టార్లు కలసి నటిస్తున్న తొలి సినిమాలో తనకు అవకాశం రావడం పట్ల హీరోయిన్ కృతీ సనన్ సంతోషంగా ఉన్నారని ముంబయ్ వర్గాల సమాచారం. వచ్చే ఏడాది మార్చిలో 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' చిత్ర షూటింగ్ ప్రారంభించి, ఆ తరువాత ఏడాది 2018 దీపావళికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. స్వాతంత్రానికి పూర్వం భారత సరిహద్దులలో హూణులు ధగ్గులు అనబడే దారిదోపిడీ గాళ్ళ ప్రభావం ఉండేది. వారి కథాంశమే ఈ సినిమాకు మూలం అంటున్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







