దట్టమైన పొగమంచుతో 21 విమానాల రద్దు ..
- January 01, 2017
దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ మొత్తం 21 విమానాల్ని రద్దు చేసినట్లు ప్రకటించింది. దట్టమైన పొగమంచుతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయాలు కలిగాయని అధికారులు తెలిపారు. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ప్రతినిథి మాట్లాడుతూ, దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో చాలా విమాన రాకపోకలకు అంతరాయాలు ఏర్పడినట్లు చెప్పారు. ప్రయాణీకులకు కలిగిన ఇబ్బందులకు చింతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రయాణీకులు విమాన రాకపోకలపై ఎప్పటికప్పుడు స్టేటస్‌ని తెలుసుకోవాలని ఆయన సూచించారు. ఫ్లైదుబాయ్‌కి చెందిన అధికార ప్రతినిథి పదుల సంఖ్యలో విమానాలు రద్దు అవడమో, లేటవడమో, లేదంటే ఇతర విమానాశ్రయాలకు డైవర్ట్ చేయడమో జరిగిందని చెప్పారు. ఇది ఊహించని పరిస్థితి అనీ, ప్రయాణీకులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రయాణీకుల భద్రతే ముఖ్యమనీ ప్రయాణీకులు అర్థం చేసుకోవాలని కోరారాయన.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







