అమెరికా దేశం విడిచి వెళ్లిపోవాలని 35 మంది రష్యా దౌత్యవేత్తలు ఆదేశం..
- January 01, 2017
అమెరికా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించిన 35 మంది దౌత్యవేత్తలు రష్యాకు పయనమయ్యారు. గూఢచర్యానికి పాల్పడ్డరానే ఆరోపణలపై వీరందరినీ అమెరికాను విడిచి వెళ్లిపోవాలని అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదేశించారు. ఈ ఆదేశాలు 72గంటల్లో అమలు కావాలని ఆయన పేర్కొన్నారు. దీంతో నూతన సంవత్సరం తొలిరోజున రష్యా దౌత్యవేత్తల విమానం మాస్కో బయల్దేరిందని అమెరికాలోని రష్యా కార్యాలయ దౌత్యవేత్త తెలిపారు. రష్యా అధ్యక్షుడు, ఇతర ముఖ్య అధికారులు ప్రయాణించే విమానంలో వీరిని మాస్కో చేర్చినట్లు ఆయన చెప్పారు.
అమెరికా భావి అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ఒబామా సర్కారు నిర్ణయాన్ని తప్పుపట్డారు.
రష్యా, అమెరికాలను హ్యాకింగ్ వ్యవహారానికి దూరంగా ఉంచాలన్నారు. అసలు కంప్యూటర్ల పనితీరునే నమ్మలేమని ఆయన వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







