హత్య కేసులో వలసదారుడికి మరణశిక్ష..

- January 01, 2017 , by Maagulf
హత్య కేసులో వలసదారుడికి మరణశిక్ష..

క్రిమినల్‌ కోర్ట్‌ ఓ హత్య కేసులో ఓ వలసదారుడికి మరణ శిక్ష విధించింది. కత్తితో తన రూమ్‌మేట్‌ని హత్య చేసిన కేసులో నిందితుడు దోషిగా నిర్ధారింపబడ్డాడు. రూమ్‌మేట్స్‌ ఇద్దరి మధ్యా చిన్న విషయమై ఘర్షణ తలెత్తగా ఒకర్ని ఒకరు అవమానించుకునేలా దూషించుకున్నారు. ఈ క్రమంలో నిందితుడు, ఆగ్రహావేశాల్ని అణచుకోలేక తన రూమ్‌మేట్‌ని కత్తితో పొడిచి చంపేశాడు. చాతిపై పదునైన కత్తితో పలుమార్లు నిందితుడు పొడవడంతో, ఆయన స్నేహితుడు చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. 
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com