తలకు మసాజ్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

- September 09, 2015 , by Maagulf
తలకు మసాజ్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తలకు మసాజ్ చేసుకోవడం లేదా చేయించుకోవడం వల్ల నేచురల్ గా విశ్రాంతి పొందవచ్చు. మానసికంగా మరియు శారీరకంగా విశ్రాంతి పొందవచ్చు . తలకు మసాజ్ చేయించుకోవడం వల్ల మనస్సు మరియు శరీరం చాలా తేలికపడుతుంది. ఎక్కువ పనిచేసేవారు, ఉద్యోగులు పనిఒత్తిడితో ఒత్తిడి ఎక్కువైనప్పుడు తప్పనిసరిగా వారంలో ఒకసారి తలకు మసాజ్ చేయించుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు . తలకు మసాజ్ చేయించుకోవడం వల్ల ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుంది, తలలో రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది, బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది. ముఖ్యంగా జీవకణాలను మరియు నరాలను విశ్రాంతి పరుస్తుంది. పొట్ట ఉదర భాగంలో మసాజ్ చేయడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు తలకు మసాజ్ చేయించుకోవడానికి స్పా లేదా సలూన్స్ కు వెళ్ళడం మంచిది. ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అలా చేసుకోవడానికి చాలా సింపుల్ అండ్ ఈజీ టిప్స్ ఉన్నాయి ... * 4-5 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను వేడి చేయాలి. * గోరువెచ్చగా ఉన్నప్పుడు, అందులో చేతి వేళ్ళు నూనెలో డిప్ చేసి తలకు పట్టించి మసాజ్ చేసుకోవాలి. లేదా గోరువెచ్చని నూనెలో కొద్దిగా కాటన్ బాల్ డిప్ చేసి తలకు మసాజ్ చేసుకోవాలి. బాడీ మసాజ్ వల్ల పొందే ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు * ఒత్తిడి లేదా తలలో ప్రెజర్ పాయింట్స్ వద్ద కొద్దిగా ప్రెస్ చేస్తూ సర్కులార్ మోషన్ లో మసాజ్ చేసుకోవడం మంచిది * 5-10మసాజ్ చేసి, తర్వాత రెండు నిముషాలు విరామం తర్వాత తిరిగి తలకు మసాజ్ చేయాలి. తలకు మసాజ్ చేయడం వల్ల పొందే కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఈ క్రింది విధంగా తలకు డీప్ గా హాట్ ఆయిల్ మసాజ్ చేసుకోవడం ల్ల మైగ్రేన్ సమస్యలను నివారిస్తుంది. రెండు వేళ్ళతో మసాజ్ చేయడం వల్ల తలనొప్పి తగ్గిస్తుంది. నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉపయోగించాలని గుర్తుంచుకోవాలి. కొన్ని నేచురల్ రెమెడీస్ వల్లనే తలనొప్పిని తగ్గించుకోవచ్చు. అయితే తరచూ ఇబ్బంది పెట్టే తలనొప్పిని హెడ్ మాసాజ్ వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. హెడ్ మసాజ్ కు కొన్ని ప్రత్యేకమైన నూనెలో ఉపయోగించడం ల్ల కూడా నొప్పి తగ్గించడంతో పాటు, మనస్సు ఉపశమనం కలిగిస్తుంది. హెడ్ మాసాజ్ వల్ల మెడ మరియు బ్యాక్ మజిల్స్ రిలాక్స్ అవుతాయి. దాని వల్ల నొప్పి నివారించబడుతుంది. వెన్ను నొప్పి తగ్గించుకోవడానికి. సలూన్ కు వెళ్ళడం మంచిది. రెస్ట్ లెస్ నైట్స్, లేదా నిద్రలేమి సమస్యలకు హెడ్ మసాజ్ చెక్ పెడుతుంది . గోరువెచ్చని నూనెతో సున్నితమైన హెడ్ మసాజ్ చేసుకోవడం వల్ల మంచిగా నిద్రపట్టడానికి సహాయపడుతుంది. ఆయిల్స్ తోటి తలకు మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ నరాలకు మెరుగ్గా ప్రవహిస్తుంది. దాంతో శరీరంలో కండరాలు రిలాక్స్ అవుతాయి . మరియు స్ట్రోక్ ను నివారించుకోవచ్చు. మనస్సు తేలికపడుతుంది. పిల్లలు చదువులో ఏకాగ్రత లేనప్పుడు, వారికి సున్నితమైన ఆయిల్ హెడ్ మసాజ్ ఎందుకు ఇవ్వకూడదు . ఇది వారి మూడ్ ను మార్చుతుంది. చదువు మీద, ఆటల మీద ఏకాగ్రత పెరుగుతుంది. తలకు గోరువెచ్చని నూనెతో మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. తలకు చేతి వేళ్ళు ఒత్తుకుంటూ మసాజ్ చేసుకోవడం వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. ఇది హైటెన్సన్ తగ్గిస్తుంది. తలకు మసాజ్ చేసుకోవడం వల్ల మొత్తం శరీరం యొక్క ఆరోగ్యాన్ని మరియు మనస్సును విశ్రాంతి పరుస్తుంది.దాంతో శరీరంను పునరుజ్జీవింపచేయడానికి సహాయపడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com