స్టాలిన్..డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్..
- January 04, 2017
ఊహించిందే జరిగింది. 48 ఏళ్ల తర్వాత డీఎంకే కొత్త నాయకుడిని ఎన్నుకుంది. డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా స్టాలిన్ బాధ్యతలు చేపట్టారు. బుధవారం చెన్నైలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో స్టాలిన్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తూ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ప‍్రతిపక్ష నేతగా, పార్టీ కోశాధికారిగా స్టాలిన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
సర్వసభ్య సమావేశంలో స్టాలిన్ మాట్లాడుతూ తనకు పదవి ముఖ్యం కాదని, పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ప్రధానమన్నారు. తనను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ఆయన కృతజ‍్ఞతలు తెలిపారు. మరోవైపు డీఎంకే రాజ్యసభ సభ్యురాలు, కరుణానిధి ముద్దుల కూతురు కనిమొళి, పెద్దకుమారుడు అళగిరి కూడా సర్వసభ్య సమావేశానికి గైర్హాజరు అయ్యారు.
ఈ సమావేశంలో అళగిరి సస్పెన్షన్ వేటు ఎత్తివేసే అంశం కూడా ప్రస్తావనకు రాలేదు.
ఇక డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి 93 ఏళ్ల వృద్ధాప్యంతో బాధ పడుతున్నారు. అందుకే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార బాధ్యతను స్టాలినే మోశారు. తన రాజకీయ వారసుడు అయ్యే లక్షణాలు స్టాలిన్‌కు ఉన్నాయంటూ కరుణానిధి ఇప్పటికే అనేక సార్లు అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కరుణానిధి ఎమ్మెల్యేగా గెలిచినా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదాను స్టాలిన్‌కే కట్టబెట్టారు.
అయితే వారసుడు స్టాలినే అని ఇంత వరకు స్పష్టంగా ప్రకటించలేదు. ఇటీవలి కాలంలో కరుణానిధి పదే పదే అనారోగ్యానికి గురవుతున్న విషయం తెలిసిందే. దీంతో డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి లేకుండానే డీఎంకే సర్వసభ్య సమావేశం ముగిసింది. అస్వస్థత కారణంగా ఆయన ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







