విజయ్ ఆంటోని రాధిక నిర్మాణంలో సినిమా..
- January 04, 2017
'సలీం', 'నాన్' చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్ ఆంటోని గత ఏడాది 'పిచ్చైక్కారన్'లో అందర్నీ సెంటిమెంట్‌తో కట్టిపడేశారు. తెలుగు ప్రేక్షకులను కూడా ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంది. త్వరలోనే ఆయన 'ఎమన్'గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా తర్వాత ఐ పిక్చర్స్ బ్యానరుపై రాధిక నిర్మాతగా ఓ సినిమాలో నటించనున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనుంది. చిత్ర విశేషాల గురించి విజయ్ ఆంటోని మాట్లాడుతూ నేను సంగీత దర్శకుడిగా కెరీర్‌ను ఆరంభించినప్పుడు రాధిక నాకు పలు అవకాశాలు ఇచ్చారు.
సంగీత దర్శకుడిగా నాకు గుర్తింపు రావడానికి ఆమే కారణం. ఇప్పుడు ఆమె బ్యానరులో నటిస్తుండటం.. సొంత బ్యానరులో నటిస్తున్నట్లు ఉంది. ఫిబ్రవరి నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది.
ఎప్పటిలాగే ఈ సినిమా శీర్షిక కూడా తప్పకుండా భిన్నంగా ఉంటుందని చెప్పారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







