శాతకర్ణి పతాక ఉత్సవం
- January 04, 2017
నందమూరి బాలకృష్ణ వందో సినిమాగా తెరకెక్కుతున్న భారీ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ స్యయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న చారిత్రక చిత్రంలో బాలీవుడ్ నటి హేమామాలినీ, శ్రియలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు.
ఇప్పటికే ట్రైలర్ రిలీజ్, ఆడియో రిలీజ్ కార్యక్రమాలను భారీగా నిర్వహించిన యూనిట్ సభ్యులు త్వరలో మరో ఉత్సవాన్ని ప్లాన్ చేశారు. శాతకర్ణి పతాక ఉత్సవం పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాల్లోని వందో థియేటర్లలో నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు.
తెలుగు చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి విజయాలకు చిహ్నంగా శాలివాహన రాజ్య చిహ్నం ఉన్న జెండాలను వంద థియేటర్లలో ఎగురవేసేలా ప్లాన్ చేస్తారు.
జనవరి 8న ఈ కార్యక్రమాన్ని తలపెడుతున్నారు. హీరో నందమూరి బాలకృష్ణ స్వయంగా విశాఖలోని జ్యోతి థియేటర్లో జెండా ఎగురవేసి ఈ పతాక ఉత్సవాన్ని ప్రారంభిస్తారు. ఇతర ప్రాంతాల్లో నందమూరి అభిమాన సంఘం నాయకులు ఇతర ప్రముఖులు జెండాలు ఎగురవేసేలా ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి







