యు.ఏ.ఈ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న మేయర్
- January 04, 2017
జీహెచ్‌ఎంసీ మేయర్, తెలంగాణ రాష్ట్ర సమితి నేత బొంతు రామ్మోహన్,అబుధాబి, దుబాయ్,షార్జా లో పర్యటించారు. వ్యక్తిగత పర్యటనలో బాగంగా ఆయన యుఏఈలోని పలు ప్రాంతాల్ని సందర్శించారు. ఈ సందర్భంగా మేయర్ బొంతు రామ్మోహన్ దుబాయ్ అందాల్ని చూసి మైమర్చిపోయారు. దుబాయ్ స్థాయిలో హైదరాబాద్‌ని అభివృద్ధి చేయాలనేది తమ ప్రభుత్వ సంకల్పమని, ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ మేయర్‌గా తనవంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. దుబాయ్ రోడ్లు, దుబాయ్‌లో అద్భుతమైన నిర్మాణాలు ఇవన్నీ ప్రపంచానికే ఓ రోల్ మోడల్ అని బొంతు రామ్మోహన్ చెప్పారు. దుబాయ్ తరహాలో అభివృద్ధి చెందేందుకు అన్ని అవకాశాలూ హైద్రాబాద్‌లో ఉన్నాయని అభిప్రాయపడ్డారాయన. తమ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందనీ, విశ్వనగరంగా హైదరాబాద్‌ని తీర్చిదిద్దేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్ దృఢ సంకల్పంతో ఉన్నారని బొంతు రామ్మోహన్ వెల్లడించారు. భారతదేశంలోనే హైదరాబాద్‌కి గొప్ప నగరంగా ఓ ప్రత్యేకత ఉందని, తమ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ ఇమేజ్ ఇంకా పెరిగిందని చెప్పారు జీహెచ్‌ఎంసీ మేయర్. దుబాయ్‌ని అక్కడి ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న తీరు, దుబాయ్‌లో ప్రజలకు అందుతున్న సౌకర్యాలు, దుబాయ్ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం వీటన్నిటినీ తాను పరిశీలించి, ఆశ్చర్యపోయాననీ, ఇక్కడి పర్యటన విశేషాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పంచుకుని, హైదరాబాద్‌ని విశ్వ నగరంగా మార్చేందుకు తనవంతుగా తోడ్పాటునందిస్తానని చెప్పారు బొంతు రామ్మోహన్.ఆయనతో పాటు శ్రీనివాస్ రెడ్డి(యం.యల్.సి),ప్రభాకర్(యం.యల్.సి),బాల మల్లన్న,శివ కుమార్(సినీ ప్రొడ్యూసర్),రవి కాంత్ రెడ్డి,మురళి ఉన్నారు.నిన్న రాత్రి యు.ఏ.ఈ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు.





తాజా వార్తలు
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్







