శుక్ర, గురు గ్రహయానంపై కన్నేసిన ఇస్రో

- January 04, 2017 , by Maagulf
శుక్ర, గురు గ్రహయానంపై కన్నేసిన ఇస్రో

హాలీవుడ్‌ సినిమా నిర్మాణ వ్యయం కన్నా తక్కువ ఖర్చుతో 'మంగళ్‌యాన్‌'ను ప్రాజెక్టును విజయవంతం చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంఘం (ఇస్రో) శుక్ర, గురు గ్రహయానంపై కన్నేసింది. తిరుపతిలో జరుగుతున్న జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌లో ఇస్రో సహాయక సంచాలకులు ఎం.నాగేశ్వరరావు ఈ విషయం వెల్లడించారు. 'మేం ఇతర గ్రహాలపై పరిశోధనలు చేపట్టాలనుకుంటున్నాం. అందులో రెండు గ్రహాలు శుక్రుడు, గురుడు. ఈ యాత్రలకు అవసరమైన వాహక నౌకలు, ఉపగ్రహాల రూపకల్పనపై విశ్లేషిస్తున్నాం. ప్రస్తుతం అధ్యయనాలు కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయి ప్రణాళికలు సిద్ధం కావడానికి మరికొన్నేళ్లు పడుతుందని' అన్నారు. భూమి నుంచి దూరం, స్థితి (పొజిషన్‌)ని బట్టి శుక్రుడిపైకి ఉపగ్రహం పంపేందుకు 19 నెలలకు ఒకసారి అవకాశం వస్తుందన్నారు. పృథ్వీ మండలం నుంచి శుక్రుడు 162 మిలియన్‌ మైళ్లు, గురుడు 610 మిలియన్‌ మైళ్ల దూరంలో ఉన్నారు. మంగళ్‌యాన్‌-2, చంద్రయాన్‌-2 యాత్రల ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. ఈ సారి చంద్రుడిపైకి రోవర్‌, ల్యాండర్‌ను పంపిస్తామని నాగేశ్వరరావు అన్నారు. వచ్చే ఏడాది చంద్రయాన్‌-2 యాత్ర చేపట్టే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com