అతడో కొత్త రకం
- January 04, 2017
సా యిరామ్ శంకర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'నేనో రకం'. రేష్మిమేనన్ కథానాయిక. శరత్‌కుమార్ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. సుదర్శన్ సలేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
త్వరలోనే పాటల్ని విడుదల చేస్తారు. దర్శకుడు మాట్లాడుతూ ''నవతరం అభిరులకి తగ్గట్టుగా రూపొందుతున్న చిత్రమిది. సమాజంలో జరుగుతున్న సంఘటనల్ని స్ఫూర్తిగా తీసుకొని అందరినీ థ్రిల్‌కి గురిచేసేలా చిత్రాన్ని సిద్ధం చేస్తున్నాం. సాయిరామ్‌శంకర్, శరత్‌కుమార్‌ల మధ్య సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతాయి'' అన్నారు.
''కొత్త రకమైన కథ, కథనాలతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు, తమిళంలోనూ విడుదల చేస్తామ''న్నారు నిర్మాత. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సిద్ధార్థ్, సంగీతం: మహిత్ నారాయణ్
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







