నోబుల్ ఫ్రైజ్ అందించినవారికి వందకోట్లు నజరానా ఏపీకి....
- January 04, 2017
తిరుపతి వేదికగా ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అట్టహాసంగా జరుగుతోంది. విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలే కాదు సాంస్కృతిక కార్యక్రమాలు దేశ విదేశాల అతిధులను ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ఏపీలోని ప్రతి ఇంటిని ప్రయోగశాలగా మారుస్తానని చంద్రబాబు చెప్పారు. ఏపీకి నోబుల్ ఫ్రైజ్ అందించినవారికి వందకోట్లు ఇస్తానని ప్రకటించారు.
ఏపికి నోబుల్ ప్రైజ్ తీసుకొస్తే 100కోట్లు ఇస్తానంటూ చంద్రబాబు ప్రకటించారు. తిరుపతి వేదికగా 3రోజు జరుగుతున్న ఇస్కాలో ప్రసంగించిన ఆయన నోబుల్ ప్రైజ్ తెచ్చి సత్తా చాటాలని, రాష్ట్రకీర్తిని అంతర్జాతీయ శిఖరంపై నిల్చోబెట్టాలని కోరారు. సైన్స్‌కు టెక్నాలజీ జోడిస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చని చంద్రబాబు అన్నారు. బాలల సైన్స్ కాంగ్రెస్‌లో పాల్గొన్న ఆయన నూతన ఆవిష్కరణలకు యువత నాంది పలకాలని పిలుపునిచ్చారు. త్వరలో అన్ని పాఠశాలల్లో వైఫై సౌకర్యం కల్పించనున్నట్లు వెల్లడించారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో యువత పాత్ర కీలకమని.. దేశానికి యువ శాస్త్రవేత్తలు అవసరమన్నారు. బ్రహ్మాండ్ సైన్స్ మ్యూజియానికి చంద్రబాబు శంకుస్ధాపన చేసారు. జీఎస్ఎల్వీ, పెరిస్కోప్,టెలిస్కోప్, ప్లానిటోరియం, సైన్స్ ఎక్సిపెరిమెంట్స్ చేయటానికి అనుకూలంగా మ్యూజియాన్ని తీర్చిదిద్దుతామన్నారు. ఇక 104 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని అలరిస్తున్నాయి. - See
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







