'వైరస్' ఫస్ట్ లుక్ రిలీజ్
- January 08, 2017
తక్కువ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు మూవీ ‘‘వైరస్’’ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది. టైటిల్స్ తోనే తన సినిమా కి హైప్స్ ని క్రియేట్ చేయడం తెలిసిన బర్నింగ్ స్టార్ ఈ సారి కూడా టైటిల్ తోనే ఎట్రాక్ట్ చేసాడు. వైరస్ మూవీ కి నోవాక్సిక్ ఓన్లీ టాక్సిన్ అనేది ఉపశీర్షిక. పల్లెరేవు రామచంద్రారెడ్డి సమర్పణలో ఎయస్ఎన్ ఫిల్మ్స్ అండ్ జస్ట్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై ఎమ్ డి సలీమ్, శ్రీనివస్ మంగాల నిర్మించిన ఈ మూవీ కి దర్శకుడు యస్.ఆర్ క్రిష్ణ.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... వైరస్ ఫస్ట్ లుక్ ని లాంఛ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమా అనుకున్న టైం లో కంప్లీట్ చేసేందుకు సహాకరించిన యూనిట్ మెంబర్స్ కి థ్యాంక్స్. అలాగే సంపూర్ణేష్ బాబు తో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. వైరస్ చిత్రం టెర్రిఫిక్ హార్రర్ కామెడీ తో పాటు మర్డర్ మిస్టరీ తో సాగే కథనం.. ఈ సినిమా యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేస్తుందని అన్నారు..
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్న వైరస్ రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటించనుంది చిత్ర యూనిట్. సంపూర్ణష్ బాబు తనదైనశైలిలో సమాజంలోని విలువలను ప్రశ్నించబోతున్నాడు. ఇప్పటికే హృదయకాలేయం, సింగం 123 సినిమాలతో తనకంటూ ప్రత్యేక మైన గుర్తింపు పొందిన ఈ బర్నింగ్ స్టార్ మరోసారి ఒక డిఫరెంట్ కామెడీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
నటీ నటులు: సంపూర్ణేష్ బాబు, గీత్ షా, నిధి షా, వెన్నల కిషోర్, వైవా హర్ష, చమ్మక్ చంద్ర, సాంకేతిక వర్గం: మ్యూజిక్: మీనాక్షి భుజంగ్, బ్యాక్ గ్రైండ్ స్కోర్: సునిల్ క్యాశప్, కొరియోగ్రఫీ: శేఖర్, భాను, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ప్రొడ్యూసర్స్: ఎమ్.డిసలీమ్, శ్రీనివాస్ మంగాల, స్టోరీ, స్క్రీన్ ప్లే , దర్శకత్వం: యస్.ఆర్. కృష్ణ - See
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







