శరీరంలో చెడు నీరా.. ప్రొద్దు తిరుగుడు ఆకులు ఉత్తమం....
- January 08, 2017
ప్రొద్దు తిరుగుడు చెట్టును సంస్కృతంలో సువర్చల అంటారు. దీని పువ్వు ఎప్పుడూ సూర్యుని వైపే తిరిగి ఉంటుంది. పూవు లోపల దుద్దు చుట్టూ చేమంతి పూవుకు వలె రేకులుంటాయి. ఈ చెట్టుకే రవిప్రియ అనే పేరు కూడా ఉంది. ప్రొద్దు తిరుగుడు చెట్టు చేదు, వగరు, కారం రుచులతో వేడి చేసే స్వభావాన్ని కలిగి ఉంటుంది. శరరంలోని కఫరోగాలను, పిత్తరోగాలను, శ్వాసరోగాలను, జ్వరాలను, చర్మరోగాలను, ప్రమేహాలను, రక్తదోషాలను పాండు వ్యాధిని హరిస్తుంది.
ప్రొద్దు తిరుగుడు గింజలతో చేసిన కషాయం అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. జీర్ణశక్తి లోపించిన వారు ప్రొద్దుతిరుగుడు గింజల తైలమును ప్రతిరోజు తగినంత మోతాదులో సేవిస్తే జీర్ణశక్తి అభివృద్ధి చెందుతుంది. ప్రొద్దు తిరుగుడు చెట్టు ఆకులను నీడలలో ఎండించి చూర్నము చేసి ఒక కప్పు పెరుగులో 1/2 చెంచా పొడిని వేసి, దానిలో 1/2 కప్పు దానిమ్మ పండు రసం కలిపి చారు కాచినట్లు వేడి చేసి దించి మూడు మూడు చెంచాల నెయ్యి చేర్చి దించి రెండు పూటలా త్రాగుతుంటే ఆమ్లముతో కడుపునొప్పుతో కూడి వేదించి ఆమ్లవిరేచనాలు త్వరగా తగ్గిపోతాయి.
ప్రొద్దు తిరుగుడు చెట్టు ఆకులు, పొట్ల చెట్టు ఆకులు రెండింటిని కలిపి ఆకు కూరలాగా వండి రెండు పూటలా తింటుంటే శరీరంలో చేరిన అధికమైన చెడు నీరు హరించిపోయి, ఉబ్బు రోగం హరించిపోతుంది. ప్రొద్దు తిరుగుడు చెట్టు ఆకులు పొడి 1/2 చెంచా మోతాదుగా ఒక కప్పు వేడి పాలలో వేసి దానిలో ఒక చెంచా త్రికటుచూర్ణం, మిరియాలు సమంగా కలిపి నూరిన చూర్ణం కలిపి రెండు పూటలా సేవిస్తే దగ్గు, దమ్ము, ఆయాసం తగ్గుతాయి. ప్రొద్దుతిరుగుడు చెట్టు వేరు బియ్యం కడిగిన నటితో నూరి గంథంలాగా అరగదీసి ఆ గంథం ఒక టీ స్పూను మోతాదుగా ఒక కప్పు బియ్యం కడిగిన నీటిలో కలిపి రెండుపూటలా సేవిస్తుంటే స్త్రీల సమస్యలు నివారణ అవుతాయి.
తేలు కుట్టిన వెంటనే ప్రొద్దు తిరుగుడు చెట్టు ఆకును మెత్తగా నూరి రెండు ముక్కులతో బాగా వాసన చూడాలి. వాసన ఊసిన మరుక్షణమే తేలు విషయం నశించిపోయి నొప్పి, బాధ, మంట వెంటనే తగ్గిపోతాయి. ప్రొద్దు తిరుగుడు చెట్టును సమూలంగా మెత్తగా దంచి, ఆముద్దను రాత్రి నిదురించే ముందు కాలి పగుళ్ళపైన పట్టిస్తుంటే పగుళ్ళు పుండ్లు తగ్గిపోయి పాదాలు ప్రకాశవంతంగా, ఆరోగ్యవంతంగా తయారవుతాయి.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







