ఇరాన్‌ మాజీ అధ్యక్షుడు రఫ్సంజానీ కన్నుమూత

- January 08, 2017 , by Maagulf
ఇరాన్‌ మాజీ అధ్యక్షుడు రఫ్సంజానీ కన్నుమూత

టెహ్రాన్‌, జనవరి 8: ఇరాన్‌ మాజీ అధ్యక్షుడు అక్బర్‌ హష్మీ రఫ్సంజానీ ఆదివారం కన్నుమూశారు. మతవాద దేశంలో ఆధునికతకు బాటలు వేసిన ఆయన వయస్సు 82 ఏళ్లు. ఆదివారం ఉదయం గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. మల్టీమిలియనీర్‌ అయిన ఈయన రాజకీయాల్లో, వ్యాపారంలో ఎత్తుజిత్తుల్లో సుప్రసిద్ధుడు.
అందుకే ఆయన్ను అక్బర్‌ షా, గ్రేట్‌ కింగ్‌ అని పిలుస్తారు. 1989 నుంచి 1997 వరకు ఆయన ఇరాన్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. 1979లో జరిగిన ఇరాన్‌ విప్లవంలో ఆయనది కీలక భూమిక. ఇరాన్‌ మధ్యతరగతి, సంపన్న వర్గాల్లో ఆయనకు మంచి పలుకుబడి ఉంది.
మితవాద ఇరాన్‌లో ఆర్థిక సంస్కరణలు అమలుచేసిన ఘనత ఆయనదే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com