జీఆర్‌ఈఎఫ్‌ క్యాంపుపై ఉగ్రదాడి

- January 08, 2017 , by Maagulf
జీఆర్‌ఈఎఫ్‌ క్యాంపుపై ఉగ్రదాడి

అక్నూర్‌: జమ్ములోని అక్నుర్‌ సెక్టార్‌లోని జనరల్‌ రిజర్వ్‌ ఇంజినీర్‌ ఫోర్స్‌ క్యాంపుపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో అక్కడ సివిల్‌ పనులు చేస్తున్న ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ఈ ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. జీఆర్‌ఈఎఫ్‌ బోర్డర్‌ రోడ్‌ ఆర్గనైజేషన్‌ మాతృసంస్థ. ఈ సంస్థ సరిహద్దుల్లోని రోడ్లు, భవనాలను నిర్వహిస్తుంటుంది. క్యాంపులోని జూరియన్‌ ప్రాంతంలో ఇద్దరు నుంచి ముగ్గురు ఉగ్రవాదులు తుపాకులతో మారుణహోమానికి తెగబడ్డారు. ఈ ప్రాంతం జమ్మూకు 55 కిలోమీటర్ల దూరంలో పాకిస్థాన్‌ సరిహద్దులో ఉంది. ఆ ప్రాంతాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకుని.. అక్కడకు వెళ్లే అన్ని మార్గాలను దిగ్బంధించి ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు ఆపరేషన్‌ ప్రారంభించారు.
ఇటీవల కాలంలో జమ్ము-కశ్మీర్‌లో ఉగ్రదాడులు పెచ్చరిల్లాయి. నవంబర్‌ చివరి వారంలో జరిగిన దాడిలో ఇద్దరు మేజర్లతో సహా ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటనలో ఉగ్రవాదులు పోలీసు దుస్తుల్లో వచ్చి కాల్పులకు తెగబడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com